19 పైసలు లాభపడిన రూపాయి | Rupee rises 19 paise to 71.59 against USD in early trade     | Sakshi
Sakshi News home page

19 పైసలు లాభపడిన రూపాయి

Nov 18 2019 10:59 AM | Updated on Nov 18 2019 1:06 PM

Rupee rises 19 paise to 71.59 against USD in early trade     - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీ  రూపాయి డాలరు మారకంలో పుంజుకుంది.  71.67 వద్ద ప్రారంభమైన రూపాయి  19 పైసలు ఎగిసి 71.59 గరిష్టాన్ని తాకింది, అయితే  లాభాలను నిలబెట్టుకోలేక ప్రస్తుతం 71.65 వద్ద ట్రేడవుతోంది.  అంతకుముందు శుక్రవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి 71.78 వద్ద స్థిరపడింది. డాలర్ ఇండెక్స్ 0.08 శాతం తగ్గి 97.92 వద్దకు చేరుకుంది. దీంతో రూపాయికి  ఊతమిచ్చినట్టు ట్రేడర్లు  చెబుతున్నారు. అటు బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.03 శాతం పెరిగి బ్యారెల్‌కు 63.32 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 

అటు చైనా అమెరికా  వాణిజ్య ఒప్పందంపై  ఇరు దేశాల మధ్య ప్రాథమికంగా "నిర్మాణాత్మక" చర్చలు జరిపినట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆదివారం  ప్రకటనలో తెలిపింది.  మరోవైపు లాభాలతో ప్రారంభమైన  దేశీయ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి.   180 పాయింట్లు ఎగిసి గరిష్టాన్ని తాకిన బెంచ్‌మార్క్‌ సూచీలు సెన్సెక్స్  16 పాయింట్లు  నష్టంతో ట్రేడ్‌ అవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement