రూపాయి రికవరీ... | Rupee hits fresh lifetime low of 72.98 against US dollar | Sakshi
Sakshi News home page

రూపాయి రికవరీ...

Sep 20 2018 12:49 AM | Updated on Nov 9 2018 5:30 PM

Rupee hits fresh lifetime low of 72.98 against US dollar - Sakshi

ముంబై: ఇంటర్‌ బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్సే్చంజ్‌ (ఫారెక్స్‌) మార్కెట్‌లో రూపాయి విలువ బుధవారం 61పైసలు రికవరీ అయ్యింది. 72.37 వద్ద ముగిసింది. ఒకేరోజు రూపాయి ఈ స్థాయిలో బలపడ్డం 18 నెలల్లో ఇదే తొలిసారి. రెండు రోజుల పాటు దాదాపు 114 పైసల నష్టంతో శుక్రవారం రూపాయి చరిత్రాత్మక కనిష్టస్థాయి 72.98 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ఒక దశలో 73కు ఒక్కపైసా దిగువనా ట్రేడయ్యింది.  తాజా బలోపేతానికి కారణాలను పరిశీలిస్తే... 

వాణిజ్య యుద్ధ ప్రభావాల నేపథ్యంలో ఆరు దేశాల కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్‌ ఇండెక్స్‌ కీలక మద్దతు 95 దిగువకు పడిపోయింది. బుధవారం రాత్రి 9 గంటల సమయానికి 94.12 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో రెండు నెలల కనిష్టం 93.91 స్థాయిని కూడా చూసింది. బుధవారం గరిష్టస్థాయి 94.33.  

ఆయా అంశాల నేపథ్యంలో.. బ్యాంకులు, దిగుమతిదారుల నుండి డాలర్‌ అమ్మకాలు భారీగా జరిగాయి. దేశంలో ఒక దశలో 72.34 స్థాయినీ చూసింది.  

ఇరాన్‌ నుంచి క్రూడ్‌ సరఫరాలు నిలిచిపోతే ఆ లోటును ఎలా భర్తీ చేయాలన్న అంశంపై ఈ వారం చివర్లో అల్జీరియాలో సమావేశం అవ్వాలని రష్యాసహా ఇతర క్రూడ్‌ ఉత్పత్తి దేశాలు నిర్ణయించాయి. దీనితో అంతర్జాతీయంగా క్రూడ్‌  ధర భారీ పెరుగుదల అంచనాలకు కొంచెం బ్రేక్‌పడింది.  

అనిశ్చితి పరిస్థితులను ‘పోటీపూర్వక కరెన్సీ విలువ తగ్గింపులతో’ ఎదుర్కొనాలని భావించడం లేదని చైనా ప్రకటించింది. దీనితో పలు వర్థమాన దేశాల కరెన్సీల సెంటిమెంట్లు మెరుగుపడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement