రూ.4,999కే షావోమి స్మార్ట్‌ఫోన్‌ | Rs 4,999 ka „Xiaomi smartphone | Sakshi
Sakshi News home page

రూ.4,999కే షావోమి స్మార్ట్‌ఫోన్‌

Dec 1 2017 1:19 AM | Updated on Nov 6 2018 5:26 PM

Rs 4,999 ka „Xiaomi smartphone - Sakshi

న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా అందుబాటు ధరలో ‘రెడ్‌మి 5ఏ’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.4,999. రెడ్‌మి 5ఏ ప్రధానంగా 2 జీబీ ర్యామ్‌/ 16 జీబీ మెమరీ, 3 జీబీ ర్యామ్‌/ 32 జీబీ మెమరీ అనే రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. వీటి ధర వరుసగా రూ.4999గా, రూ.6,999గా ఉంది. అయితే ఇక్కడ 2 జీబీ ర్యామ్‌/ 16 జీబీ మెమరీ వేరియంట్‌ ధర మాత్రం తొలి 50 లక్షల యూనిట్లకు మాత్రమే వర్తిస్తుందని, తర్వాత ఫోన్‌ ధర రూ.5,999గా ఉంటుందని షావోమి ఇండియా పేర్కొంది. భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో షావోమి బ్రాండ్‌ను అగ్రస్థానంలో నిలిపినందుకు వినియోగదారులకు రూ.1,000 డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. డిస్కౌంట్‌ అమౌంట్‌ విలువ రూ.500 కోట్లుగా ఉంటుందని పేర్కొంది. ‘అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని వీలైనంత మందికి చేరువ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. టెక్నాలజీ వల్ల జీవితాలు మెరుగుపడతాయి’ అని షావోమి వైస్‌ ప్రెసిడెంట్, సంస్థ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనూ జైన్‌ వివరించారు.

ఫోన్‌ ప్రత్యేకతలు
భారత్‌లోనే తయారైన ‘రెడ్‌మి 5ఏ’ స్మార్ట్‌ఫోన్‌లో 5 అంగుళాల డిస్‌ప్లే, 1.4 గిగాహెర్ట్జ్‌ క్వాడ్‌కోర్‌ క్వాల్‌కామ్‌ ప్రాసెసర్, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 13 ఎంపీ రియర్‌ కెమెరా, 3,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయి. ఈ ఫోన్లు డిసెంబర్‌ 7 నుంచి ఫ్లిప్‌కార్ట్, మి.కామ్, మి హోమ్‌ స్టోర్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement