రాబర్ట్‌ వాద్రాకు ఈడీ సమన్లు

Robert Vadra Summoned By ED In Money Laundering Case - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : విదేశాల్లో అక్రమాస్తులకు సంబంధించి మనీల్యాండరింగ్‌ కేసులో కాం‍గ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు ఈడీ బుధవారం సమన్లు జారీ చేసింది. దర్యాప్తు ఏజెన్సీ అధికారుల ఎదుట గురువారం ఉదయం హాజరు కావాలని కోరింది. లండన్‌లో 2 కోట్ల పౌండ్ల ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేసిన క్రమంలో వాద్రాపై మనీల్యాండరింగ్‌ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

ఇదే కేసులో ఈ ఏడాది ఏప్రిల్‌ 1న వాద్రాకు ముందస్తు బెయిల్‌ మంజూరైన విషయం తెలిసిందే. కేసులో సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించరాదని కూడా వాద్రాను కోర్టు కోరింది. ఇదే కేసులో వాద్రా సన్నిహితుడు మనోజ్‌ అరోరాకు కూడా కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top