రెనాల్ట్‌ డస్టర్‌ కారుపై భారీ తగ్గింపు | Renault Offers Discount On Duster By Up To Rs 2 Lakh | Sakshi
Sakshi News home page

రెనాల్ట్‌ డస్టర్‌ కారుపై భారీ తగ్గింపు

Aug 11 2017 7:27 PM | Updated on Sep 17 2017 5:25 PM

రెనాల్ట్‌ డస్టర్‌ కారుపై భారీ  తగ్గింపు

రెనాల్ట్‌ డస్టర్‌ కారుపై భారీ తగ్గింపు

ఫ్రెంచ్ కారు మేకర్‌ రెనాల్ట్ ఇండియా డస్టర్‌ కార్లపై భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌ అందిస్తోంది.

ఫ్రెంచ్ కారు  మేకర్‌ రెనాల్ట్ ఇండియా డస్టర్‌ కార్లపై భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌ అందిస్తోంది.  బేసిక్‌,  హై ఎండ్‌  మోడల్‌ కార్లపై   భారీ తగ్గింపును   ప్రకటించింది. బేస్‌ మోడల్‌పై లక్షన్నర్‌. హై ఎండ్‌మోడల్‌పై రూ.2 లక్షల వరకు ధరను తగ్గించినట్టు తెలిపింది. అంతేకాదు ఎక్సేంజ్‌ ఆఫర్‌ కూడా అందిస్తోంది.  అయితే ప్రత్యేకంగా 'గ్యాంగ్ ఆఫ్ డస్టర్' (కంపెనీ అధికారిక మెంబర్‌ షిప్‌ ఉన్న సభ్యులు) సభ్యులకు  మాత్రమే ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయి.

 రెనాల్ట్‌ డస్టర్ కాంపాక్ట్ ఎస్యూవీపై 2.17 లక్షల వరకు డిస్కౌంట్‌ను అందిస్తోంది. బేస్ మోడల్‌పై రూ. 1.6 లక్షల తగ్గింపు ఉండగా, టాప్-ఎండ్ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ ధర రూ.2 లక్షల మేర తగ్గనుంది. జీవోడీ సభ్యులకు రూ. 10వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తోపాటు మరో  రూ.7వేల వరకు కార్పొరేట్‌ డిస్కౌంట్‌ అందిస్తోంది.  ఈ తగ్గింపు ధరలు ఎక్స్-షోరూమ్ ధరలపై పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్ల కు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

క్యాప‍్చర్‌ అనే కొత్త వెహికల్‌ లాంచింగ్‌ కుముందు, ఉన్న స్టాకును  క్లియర్ చేసే  యోచనలో  ఈ  పరిమిత కాల ఆఫర్ను ప్రకటించింది. క్యాప‍్చర్‌ ను రానున్నపండుగ సీజన్‌లో లాంచ్‌   చేయాలని కంపెనీ ప్లాన్‌ చేస్తోంది.  కాగా బేస్ మోడల్  లో 35 యూనిట్లు,  టాప్-ఎండ్ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ 73 యూనిట్లు మాత్రమే అందుబాటులోఉన్నాయి. బేస్‌  మోడల్‌ వైట్‌ కలర్‌ ఆప్షన్‌లోనూ, టాప్‌ మోడల్‌ వైట్‌ అండ్‌ సిల్వర్‌ రంగుల్లోనూ లభ్యం.  కాగా రెనాల్ట్ డస్టర్ భారతదేశంలో హ్యుందాయ్ క్రెటా,  ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ,  హోండా బీఆర్‌-వీ  లకు గట్టి పోటీగా నిలిచింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement