జియోఫోన్ 2 : కస‍్టమర్లకు గుడ్‌న్యూస్‌

Reliance JioPhone 2 to go on sale tomorrow, for the first time in India - Sakshi

సాక్షి, ముంబై: జియోఫోన్‌ హైఎండ్‌ మోడల్‌ జియోఫోన్‌ 2​ కోసం ఎదురు చూస్తున్నఅభిమానులకు గుడ్‌న్యూస్‌. రేపటి నుంచే ఈ డివైజ్‌ బుకింగ్‌కు అందుబాటులోకి వస్తుంది. ఎల్లుండి అంటే ఆగస్టు 16న ఈ ఫోన్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసుకోవచ్చు. ఆగస్టు 16న మధ్యాహ్నం 12 గంటలకు జియో.కామ్‌లో ఈ ఫీచర్‌ ఫోన్‌ ఫ్లాష్‌ సేల్‌ను నిర్వహించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది జూలైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ జియో ఫోన్‌ 2ను ‍ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పుడే ఆగస్టు 15 నుంచి మై జియో యాప్‌, జియో.కామ్‌ ద్వారా ఈ ఫోన్‌ను బుకింగ్‌కు అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొన్నారు. జియో ఫోన్2 ధరను రూ .2999గా రిలయన్స్‌ నిర్ణయించింది.  యూ ట్యూబ్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ లాంటి ప్రముఖ నెట్‌వర్కింగ్‌ సైట్లకు కూడా అనుమతి ఉంది.  దీంతోపాటు  దేశంలో జియో జిగాఫైబర్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కూడా  రేపే ప్రారంభం కానుంది.

జియోఫోన్‌ 2  స్పెసిఫికేషన్లు
 2.4 అంగుళాల డిస్‌ ప్లే 
240 X 320 పిక్సల్స్ రిసల్యూషన్ 
4 జీబీ, 512ఎంబీ స్టోరేజ్‌
128జీబీవరకు విస‍్తరించుకునే అవకాశం
2ఎంపీ రియర్‌ కెమెరా
0.3 ఎంపీ సెల్పీ కెమెరా
2000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ 41వ వార్షిక సమావేశంలో ముకేష్ అంబానీ గత ఏడాది చివరినాటికి 124 మిలియన్ల నుంచి 210 మిలియన్లకు పెరిగినట్లు తెలిపారు. ఈ సందర్భంగా  ఫిక్స్‌డ్‌  లైన్‌ బ్రాండ్‌ బాండ్‌ సర్వీసులు జియోగిగా ఫైబర్‌ను కూడా ప్రకటించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top