పదివేల టవర్లతో​ ఏపీలోదూసుకుపోతున్న జియో | Reliance Jio A solid mobile network  with over 10k towers | Sakshi
Sakshi News home page

పదివేల టవర్లతో​ ఏపీలో దూసుకుపోతున్న జియో

Jul 11 2019 5:20 PM | Updated on Jul 11 2019 5:21 PM

Reliance Jio A solid mobile network  with over 10k towers - Sakshi

సాక్షి,  విజ‌య‌వాడ‌ : భారత‌దేశ వ్యాప్తంగా జియో సృష్టించిన డిజిట‌ల్  సేవలను ఆంధ్ర‌ప్ర‌దేశ్ వాసుల‌కు మ‌రింత అందుబాటులో  తీసుకొచ్చామని  రిలయన్స్‌ జియో ఒక ప్రకటనలో వెల్లడించింది.  స‌మ‌గ్ర‌మైన మొబైల్ నెట్‌వ‌ర్క్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్త‌రించిబ‌డిన నేప‌థ్యంలో ఈ డిజిట‌ల్ విప్ల‌వం రాష్ట్ర ప్ర‌జానికానికి మ‌రింత చేరువైందనీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 10వేల మొబైల్ ట‌వ‌ర్ల కీల‌క మైలురాయిని  చేరుకున్నామిన వెల్లడించింది. తద్వారా నెట్వర్క్ పరంగా మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకున్నామని పేర్కొంది.జియో నెట్‌వ‌ర్క్ ప‌రిధిని మరింత విస్తరించుకుని రాష్ట్రంలోని ప్ర‌తి  ఇంటిని చేరుకోవడంతాటు,  వారంద‌రికీ జియో డిజిట‌ల్ లైఫ్ ప్ర‌యోజ‌నాలు అందించాల‌ని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపింది. 

జియో వెల్లడించిన  వివరాల ప్రకారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 13.07 మిలియ‌న్ల మంది చందాదారులు ప్ర‌స్తుతం రాష్ట్రవ్యాప్తంగా డిజిట‌ల్ సేవ‌ల‌ను పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌తి నెల జియో ప్ర‌తి జిల్లా నుంచి అనేక మంది చందాదారుల‌ను త‌న ఖాతాలో జ‌మ‌చేసుకుంది. ప్రతిపౌరుడికి డేటా  అనే ల‌క్ష్యంతో 34 నెల‌ల క్రితం జియో సేవ‌లు ప్రారంభం అయ్యాయి. భార‌త‌దేశానికి చెందిన డిజిట‌ల్ ముఖ‌చిత్రాన్ని స‌మూలంగా మార్చివేయడంలో జియో అత్యంత కీల‌క‌మైన పాత్ర పోషించింది.

కాగా ఉచిత కాలింగ్‌ సేవలు, డాటా సేవలతో టెలికాం రంగంలోకి దూసుకొచ్చిన  రిలయన్స్‌ జియో అతి స్వల్ప కాలంలోనే అతి ఎక్కువ వినియోగదారులనుసొంతం చేసుకుంది. అలాగే ప్ర‌పంచంలోనే అతి ఎక్కువ మొబైల్ డాటా వినియోగదారులతో భార‌త‌దేశాన్ని నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిపింది.  ఏప్రిల్ 2019 ట్రాయ్ గ‌ణాంకాల ప్ర‌కారం, 314.8 మిలియ‌న్ల చందాదారుల‌ను జియో క‌లిగి ఉంది.

జియో డిజిటల్‌ లైఫ్‌ ప్రయోజనాలు
జియో వినియోగ‌దారులంద‌రికీ సాటిలేని క‌నెక్టివిటీ సౌల‌భ్యం, 4జీ నెట్‌వ‌ర్క్ యొక్క శ‌క్తివంత‌మైన మ‌రియు విస్తృత శ్రేణి నెట్ వ‌ర్క్‌తో ఉత్త‌మ సేవ‌లు.
జియో  అన్‌లిమిటెడ్ వాయిస్‌,  డాటా ప్ర‌యోజ‌నాలు
జియో ప్రీమియం యాప్స్  ప్ర‌యోజ‌నాలు పొందే అవ‌కాశం, జియో టీవీ (అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన క్యాచ్ ఆప్ టీవీ యాప్‌), జియో మ్యూజిక్, జియో సినిమా స‌హా మ‌రెన్నింటినో ఆనందించవచ్చు.
జియో సిమ్ కార్డుల‌ను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉంచ‌డం.
జియో సేవ‌ల‌ను సుల‌భంగా, సౌక‌ర్య‌వంతంగా పొందేలా తీర్చిదిద్ద‌డం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement