రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ప్లాన్ సి స్టూడియో జేవీ | Reliance Entertainment and Friday Filmworks form JV called Plan C | Sakshi
Sakshi News home page

రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ప్లాన్ సి స్టూడియో జేవీ

Feb 3 2016 1:36 AM | Updated on Sep 3 2017 4:49 PM

చిత్ర నిర్మాణం కోసం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్, నీరజ్ పాండే, శీతల్ భాటాయాల ఫ్రైడే ఫిల్మ్‌వర్క్స్ ఒక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి.

ఫ్రైడే ఫిల్మ్‌వర్క్స్‌తో కలిసి చిత్ర నిర్మాణం
 న్యూఢిల్లీ: చిత్ర నిర్మాణం కోసం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్, నీరజ్ పాండే, శీతల్ భాటాయాల ఫ్రైడే ఫిల్మ్‌వర్క్స్ ఒక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ప్లాన్ సి స్టూడియోస్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ జేవీలో ఇరు సంస్థలకు 50:50 శాతం వాటాలున్నాయి.  ప్లాన్ సి స్టూడియోస్ తొలి చిత్రంగా అక్షయ్ కుమార్ హీరోగా టిను సురేశ్ దేశాయ్ దర్శకత్వంలో రుస్తోమ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నీరజ్, శీతల్ వంటి సృజనాత్మక వ్యక్తులతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం సంతోషంగా ఉందని రిలయన్స్ గ్రూప్ ఎండీ అమితాబ్ ఝున్‌ఝున్‌వాలా చెప్పారు. రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్‌తో ఒప్పందం చెప్పుకోదగినదని నీరజ్ పాండే వ్యాఖ్యానించారు. వినోదాత్మక అంశాలతో వినూత్నమైన సినిమాలను అందిస్తామని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement