రిలయన్స్‌ క్యాపిటల్‌  లాభం రూ.213 కోట్లు  

Reliance Capital's net profit was Rs 2,133 crore - Sakshi

ముంబై: రిలయన్స్‌ క్యాపిటల్‌ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.213 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.6 కోట్ల నికర లాభం వచ్చిందని రిలయన్స్‌ క్యాపిటల్‌ తెలిపింది. సాధారణ బీమా విభాగం మంచి లాభాలు సాధించడంతో ఈ క్యూ3లో ఈ స్థాయి నికర లాభం వచ్చిందని వివరించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.5,386 కోట్ల నుంచి రూ.5,016 కోట్లకు తగ్గిందని తెలిపింది. మొత్తం ఆస్తులు 7 శాతం పెరిగి రూ.89,400 కోట్లకు పెరిగాయని వివరించింది.

ఈ క్యూ3లో మ్యూచువల్‌ ఫండ్‌ విభాగం, రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ రూ.110 కోట్ల నికర లాభం సాధించిందని రిలయన్స్‌ క్యాపిటల్‌ తెలిపింది. నిర్వహణ ఆస్తులు 7% పెరిగి రూ.4,14,362 కోట్లకు పెరిగాయని పేర్కొంది. హోమ్‌ ఫైనాన్స్‌ విభాగం, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ లోన్‌ బుక్‌ 26 శాతం ఎగసి రూ.16,160 కోట్లకు పెరిగిందని తెలిపింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో రిలయన్స్‌ క్యాపిటల్‌ షేర్‌ 1.7% లాభంతో రూ.139 వద్ద ముగిసింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top