
‘స్కాచ్ అండ్ సోడా’తోరిలయన్స్ బ్రాండ్స్ భాగస్వామ్యం
రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్‌కు చెందిన ‘రిలయన్స్ బ్రాండ్స్’ తాజాగా ఆమ్‌స్టర్‌డామ్‌కు చెందిన ఫ్యాషన్ బ్రాండ్ ‘స్కాచ్ అండ్ సోడా’తో ...
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్‌కు చెందిన ‘రిలయన్స్ బ్రాండ్స్’ తాజాగా ఆమ్‌స్టర్‌డామ్‌కు చెందిన ఫ్యాషన్ బ్రాండ్ ‘స్కాచ్ అండ్ సోడా’తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం.. రిలయన్స్ బ్రాండ్స్ దేశంలోని అన్ని ప్రముఖ పట్టణాల్లో ‘స్కాచ్ అండ్ సోడా’ స్టోర్లను ఏర్పాటు చేస్తుంది. ఇది 2017 నాటికి పూర్తవుతుంది. అలాగే రిలయన్స్ బ్రాండ్స్ ఈ ఫ్యాషన్ బ్రాండ్‌కు చెందిన ప్రొడక్ట్‌లను దేశంలో విక్రయిస్తుంది.
ప్రస్తుతం ‘స్కాచ్ అండ్ సోడా’కు అంతర్జాతీయంగా 160 స్టోర్లున్నాయి. భారత్ వంటి ప్రధానమైన మార్కెట్‌లో తమ బ్రాండ్ మరింత మందికి చేరువ చేయడానికి రిలయన్స్‌తో ఒప్పందం దోహదపడుతుందని ‘స్కాచ్ అండ్ సోడా’ సీఈవో డిర్క్ జాన్ స్టోఫెలెన్‌బర్గ్ తెలిపారు. ప్రీమియం రిటైల్ మార్కెట్‌లో వృద్ధికి ఈ భాగస్వామ్యం తమకు ఉపయోగపడుతుందని రిలయన్స్ బ్రాండ్స్ ప్రెసిడెంట్ దర్శన్ మెహ్‌తా పేర్కొన్నారు.