బేస్ రేటు తగ్గించిన ఎస్‌బీహెచ్

బేస్ రేటు తగ్గించిన ఎస్‌బీహెచ్


 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) బేస్ రేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో ఎస్‌బీహెచ్ బేస్ రేటు 10.05 శాతం నుంచి 9.95 శాతానికి తగ్గింది. దీంతో గృహరుణాలతో పాటు ఇతర రుణాలకు చెల్లించే ఈఎంఐలు తగ్గుతాయని, 30 ఏళ్ల గృహరుణానికి లక్ష రూపాయలకు రూ. 874 ఈఎంఐ చెల్లిస్తే సరిపోతుందని బ్యాంక్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు- బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటును ఈ ఏడాది ఇప్పటికి మూడు సార్లు 0.75 శాతం(7.25 శాతానికి) తగ్గించింది. దీనితో పలు బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు కొంతమేర బదలాయించాయి. రుణ రేటు తగ్గడం డిపాజిట్ రేటు తగ్గడానకీ సంకేతం.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top