అక్టోబర్‌లో తగ్గిన తయారీ స్పీడ్‌ : నికాయ్‌

 Reduced manufacturing speed in October: Nikai - Sakshi

న్యూఢిల్లీ: తయారీ రంగం అక్టోబర్‌లో మందగించింది. నికాయ్‌ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) తాజా గణాంకాల ప్రకారం– అక్టోబర్‌ సూచీ 50.3గా నమోదయ్యింది. సెస్టెంబర్‌లో ఈ సూచీ 51.2 వద్ద ఉంది. అయితే నికాయ్‌ పీఎంఐ ప్రకారం– సూచీ 50 లోపునకు పడిపోతేనే క్షీణతగా భావించడం జరుగుతుంది.

ఆ పైన వృద్ధి ధోరణిగానే పరిగణిస్తారు. మూడు నెలల నుంచీ 50 పాయింట్ల పైనే సూచీ కొనసాగుతోంది. అయితే అక్టోబర్‌లో స్పీడ్‌ తగ్గడానికి డిమాండ్‌ పరిస్థితుల బలహీనత, జీఎస్‌టీ ప్రతికూల పరిస్థితులు కారణమని సంబంధిత సర్వే తెలిపింది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top