షావోమి రిపబ్లిక్‌ డే సేల్‌, ఆఫర్‌లో మొబైల్స్‌ | Redmi 5A, Other Mobiles Available With Offers in Xiaomi's Republic Day Sale  | Sakshi
Sakshi News home page

షావోమి రిపబ్లిక్‌ డే సేల్‌, ఆఫర్‌లో మొబైల్స్‌

Jan 23 2018 5:32 PM | Updated on Jan 24 2018 3:01 PM

Redmi 5A, Other Mobiles Available With Offers in Xiaomi's Republic Day Sale  - Sakshi

షావోమి రేపటి నుంచి రిపబ్లిక్‌ డే సేల్‌కు తెరలేపింది. ఎంఐ.కామ్‌లో ఈ సేల్‌ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా మొబైల్‌ ఫోన్లు, ఆడియో యాక్ససరీస్‌, పవర్‌ బ్యాంక్స్‌, హోమ్‌ గాడ్జెట్స్‌, ఇతర ఉత్పత్తులపై షావోమి ప్రకటించింది. నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్‌, రిపబ్లిక్‌ డే వరకు కొనసాగనుంది. ఈ సేల్‌ పిరియడ్‌లో ప్రతిరోజు ఉదయం 10 గంటలకు డిస్కౌంట్‌ కూపన్లను కంపెనీ అందిస్తోంది. రూ.50, రూ.100, రూ.200, రూ.500 డినామినేషన్లలో ఈ డిస్కౌంట్‌ కూపన్లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా మొబిక్విక్‌ ద్వారా జరిపిన పేమెంట్లకు ఫ్లాట్‌ 30 శాతం సూపర్‌ క్యాష్‌ను ఆఫర్‌ చేస్తోంది. మూడు నెలల హంగామా ప్లే సబ్‌స్క్రిప్షన్‌ను, 12 నెలలు హంగామా మ్యూజిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఈ సేల్‌లో కొనుగోలుదారులకు లభిస్తోంది. 

వీటితో పాటు 14,999 రూపాయలుగా ఉన్న ఎంఐ ఏ1 స్మార్ట్‌ఫోన్‌ 13,999 రూపాయలకే లభ్యమవుతోంది. ఎంఐ మిక్స్‌2 ధర 35,999 రూపాయల నుంచి 32,999 రూపాయలకు తగ్గించింది. ఎంఐ మ్యాక్స్‌2 ధరను కూడా వెయ్యి రూపాయల మేర తగ్గించింది. అదేవిధంగా ఈ సేల్‌లో కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా లాంచ్‌ చేసిన స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి 5ఏ కూడా 4999 రూపాయల నుంచి విక్రయానికి వచ్చింది.

రెడ్‌మి వై1 ప్రారంభ ధర 8,999 రూపాయలు కాగ, రెడ్‌మి వై1 లైట్‌ 6,999 రూపాయల నుంచి అందుబాటులో ఉంది. 20000 ఎంఏహెచ్‌ ఎంఐ పవర్‌ బ్యాంకు 2ఐ రూ.1499కు, 10000 ఎంఏహెచ్‌ ఎంఐ పవర్‌ బ్యాంకు 2ఐ రూ.799కు, ఎంఐ బ్యాండ్‌-హెచ్‌ఆర్‌ఎక్స్‌ ఎడిషన్‌ రూ.1299కు షావోమి అందుబాటులో ఉంచింది. పలు స్మార్ట్‌ఫోన్‌ కేసులు, కవర్లపై 200 రూపాయల వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నట్టు ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement