64 మెగాపిక్సెల్‌ కెమెరాతో స్మార్ట్‌ఫోన్‌ | Realme Launch 64 MP Camera Smartphone | Sakshi
Sakshi News home page

64 మెగాపిక్సెల్‌ కెమెరాతో స్మార్ట్‌ఫోన్‌

Jun 25 2019 12:46 PM | Updated on Jun 25 2019 12:46 PM

Realme Launch 64 MP Camera Smartphone - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ 64 మెగా పిక్సెల్‌ కెమెరాతో స్మార్ట్‌ఫోన్‌ను రూపొందిస్తోంది. శామ్‌సంగ్‌ జీడబ్ల్యూ1 సెన్సార్‌తో అభివృద్ధి చేసిన ఈ కెమెరాతో తీసిన చిత్రాన్ని కంపెనీ సీఈవో మాధవ్‌ సేథ్‌ ట్వీట్‌ చేశారు. మొదటిసారిగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేస్తారు. ప్రపంచంలో తొలిసారిగా 64 మెగా పిక్సెల్‌ కెమెరాను పొందుపరిచిన స్మార్ట్‌ఫోన్‌ ఇదే కావడం గమనార్హం. శామ్‌సంగ్‌ టెట్రాసెల్‌ టెక్నాలజీతో తయారైన ఈ కెమెరాతో తక్కువ వెలుతురులోనూ స్పష్టమైన చిత్రాలను తీయవచ్చు. వెనుకవైపు నాలుగు కెమెరాలు పొందుపరిచారు. కాగా, రియల్‌మీ జనవరి– మార్చి కాలంలో భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో 7.25 శాతం వాటా దక్కించుకుంది. డిసెంబర్‌ నాటికి 12–15 శాతం వాటాను లక్ష్యంగా చేసుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement