స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఐకూ కొత్తగా జె11 పేరిట 5జీ ఫోన్‌ను ఆవిష్కరించింది. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దినట్లు సంస్థ తెలిపింది. దీని ధర రూ. 31,499 నుంచి ప్రారంభమవుతుంది.
ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో, 6.83 అంగుళాల కర్వ్‌డ్ డిస్‌ప్లే, ఏఐ క్రియేషన్, వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టం, 7050 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్స్ ఫ్లాష్‌ఛార్జ్, 50 ఎంపీ సోనీ కెమెరా మొదలైన ఫీచర్లు ఉంటాయి.
దీనితో పాటు ఐకూ బడ్స్‌ని కూడా కంపెనీ ఆవిష్కరించింది. దీని గరిష్ట ప్లేబ్యాక్ సమయం 50 గంటల వరకు ఉంటుంది. ధర రూ. 1,699 నుంచి ప్రారంభం అవుతుంది. జెడ్11 ఫోన్ల అమ్మకాలు ఆగస్టు 25 నుంచి, బడ్స్ విక్రయాలు ఆగస్టు 24 నుంచి ప్రారంభమవుతాయి.


