రియల్‌ మి2 ప్రొ: బడ్జెట్‌ ధర, అద్భుత ఫీచర్లు | Sakshi
Sakshi News home page

రియల్‌ మి2 ప్రొ: బడ్జెట్‌ ధర, అద్భుత ఫీచర్లు

Published Thu, Sep 27 2018 3:54 PM

Realme 2 Pro launched starting at Rs 13,990 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఒప్పో కు చెందిన బ్రాండ్‌ రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రియల్‌ మి 1, రియల్‌ మి2కు కొనసాగింపుగా తాజాగా రియల్‌ మి 2 ప్రొను విడుదల చేసింది. డ్యూ డ్రాప్‌-స్టైల్‌నాచ్‌, భారీ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 660 చిప్‌సెట్, డ్యుయల్‌ వెనుక కెమెరాలుతో బడ్జెట్‌ ధరలో దీన్ని లాంచ్‌ చేసింది. ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ తో ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్లాక్ సీ, బ్లూ ఓషన్, ఐస్ లేక్ మూడు రంగుల ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. అలాగే మూడు వేరియంట్లలో ఈ డివైస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్టోబర్ 11న ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రత్యేకంగా విక్రయించనున్నామని కంపెనీ తెలిపింది.  

రియల్‌ మి 2 ప్రో 4జీబీ ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌  ధర రూ. 13,990
6జీబీ ర్యామ్‌/ 64జీబీ స్టోరేజ్‌ ధర రూ. 15,990
8జీబీ / 128జీబీ స్టోరేజ్‌ ధర రూ. 17,990గా ఉండనుంది.

రియల్‌ మి2 ప్రొ ఫీచర్లు
6.3అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ స్క్రీన్
ఆండ్రాయిడ్‌ ఓరియో 8.1
8జీబీ ర్యామ్‌ 128 జీబీ స్టోరేజ్‌
256దాకా విస్తరించుకునే అవకాశం
16+2 ఎంపీ డ్యుయల్‌ కెమెరా
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

 

Advertisement

తప్పక చదవండి

Advertisement