రియల్‌ మి 2 ప్రొ... లాంచింగ్‌ త్వరలో | Realme 2 Pro India Launch Expected on September 27 | Sakshi
Sakshi News home page

రియల్‌ మి 2 ప్రొ.. లాంచింగ్‌ త్వరలో

Sep 14 2018 11:43 AM | Updated on Sep 14 2018 11:43 AM

Realme 2 Pro India Launch Expected on September 27 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఒప్పో సబ్‌ బ్రాండ్‌ రియల్‌మి మరో సరికొత్త ఫోన్‌నులాంచ్‌ చేయనుంది. భారత మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్‌ పోర్ట్‌ఫోలియోను విస్తరించు కోవాలని  భారీ ప్లాన్‌ చేస్తోంది. రియల్‌ మి 1,  రియల్‌ మి2  రెండు వేరియంట్ల భారీ విజయం  తర్వాత తాజాగా మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది  ఈ  నేపథ్యంలో రియల్‌ మి 2 ప్రొ పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంచనుంది.  పూర్తి వివరాలను వెల్లడించనప్పటికీ..ఈ మేరకు సంస్థ  మీడియాకు ఆహ్వానాలను పంపింది.

సెప్టెంబరు 27న నిర్వహించనున్న ఈ ఈవెంట్‌లో రియల్‌ మి2 ప్రొపేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయనుందన్న అంచనాలు భారీగా నెలకొన్నాయి.  రియల్‌ మి 2 తరహాలోనే ఈ డివైస్‌ ధరను అందుబాటులో ఉంచనున్నట్టు తెలుస్తోంది. (రియల్‌మి 2 బేసిక్‌  మోడల్‌ధర రూ. 8,990,  4జీబీ, 64 జీబీ స్టోరేజి  వేరియంట్‌ ధర రూ.10,990) అంతేకాదు వేగవంతమైన పనితీరును అందించడానికి కొత్త సాక్‌ తో రాబోతోందిట.

రియల్‌ మి 2 ఫీచర్లు
6.20 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే
19:9 యాస్పెక్ట్ రేషియో
1.8 గిగా హెడ్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌
256 జీబీ దాకా విస్తరించుకునే  సదుపాయం
720x1520  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
13+2ఎంపీ  డ్యుయల్‌రియర్‌ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
4230ఎంఎహెచ్‌ బ్యాటరీ
 

Advertisement
 
Advertisement
Advertisement