ఇక కోటి పైగా చెక్ బౌన్స్ అయినా.. కొత్త చెక్ బుక్! | RBI issues fresh guidelines to deal with bounced cheques | Sakshi
Sakshi News home page

ఇక కోటి పైగా చెక్ బౌన్స్ అయినా.. కొత్త చెక్ బుక్!

Aug 5 2016 1:18 AM | Updated on Sep 4 2017 7:50 AM

ఇక కోటి పైగా చెక్ బౌన్స్ అయినా.. కొత్త చెక్ బుక్!

ఇక కోటి పైగా చెక్ బౌన్స్ అయినా.. కొత్త చెక్ బుక్!

చెక్‌బుక్ జారీ నిబంధనలను ఆర్‌బీఐ సడలించింది. దీనిప్రకారం.. కోటి పైబడిన చెక్ బౌన్స్ జరిగినా కస్టమర్‌కు, కొత్త చెక్ బుక్ జారీ చేసే నిర్ణయాధికారాన్ని ఇకపై బ్యాంకింగ్ కలిగి ఉంటుంది.

ముంబై : చెక్‌బుక్ జారీ నిబంధనలను ఆర్‌బీఐ సడలించింది. దీనిప్రకారం..  కోటి పైబడిన చెక్ బౌన్స్ జరిగినా కస్టమర్‌కు, కొత్త చెక్ బుక్ జారీ చేసే నిర్ణయాధికారాన్ని ఇకపై బ్యాంకింగ్ కలిగి ఉంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరం నాలుగుసార్లు ‘తగిన నిధులు లేక’ చెక్ బౌన్స్ సంభవించి, ఆ మొత్తమూ రూ.కోటి, ఆపైబడి ఉంటే, సంబంధిత కరెంట్ అకౌంట్ హోల్డర్‌కు కొత్త చెక్కు జారీ చేసే అధికారం బ్యాంకింగ్‌కు లేదు. ఇలాంటి సందర్భాల్లో అసలు అకౌంట్ క్లోజ్ చేసే అధికారమూ బ్యాంకింగ్‌కు ఉంటుంది. అయితే ఆయా అంశాలకు సంబంధించి ఎలాంటి నిబంధనలు పాటించాలన్న అంశాన్ని బ్యాంక్ బోర్డ్ లేదా  కమిటీ నిర్ణయం తీసుకోవాలనీ ఆర్‌బీఐ తన తాజా నోటిఫికేషన్‌లో సూచించింది. ఈ మేరకు స్వయంగా నిర్దిష్ట మార్గదర్శకాలను అనుసరించాలని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement