ఐదు బ్యాంకులపై రూ. 10 కోట్ల జరిమానా

RBI fines five banks for non-compliance with Swift - Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌  రెగ్యులేటర్‌– ఆర్‌బీఐ ఐదు బ్యాంకులపై రూ.10 కోట్ల జరిమానా విధించింది.  అలహాబాద్‌ బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, యస్‌ బ్యాంక్, కెనరా బ్యాంక్‌లు ఇందులో ఉన్నాయి. నోస్ట్రో ఖాతాలకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించడంవల్ల ఆర్‌బీఐ అలహాబాద్‌ బ్యాంక్‌పై జరిమానా విధించింది. ఒక బ్యాంక్‌ వేరే బ్యాంక్‌లో విదేశీ కరెన్సీలో నిర్వహించే ఖాతాను నోస్ట్రో ఖాతాగా వ్యవహరిస్తారు.   అంతర్జాతీయ మెసేజింగ్‌ సాఫ్ట్‌వేర్‌..స్విఫ్ట్‌కు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనలకుగాను ఈ రెండు బ్యాంక్‌లపై ఆర్‌బీఐ చెరో కోటి రూపాయలు  జరిమానా విధించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top