breaking news
RBI fined
-
ఫోన్‌పేకు రూ.21 లక్షల జరిమానా: కారణం ఇదే..
నియమాలను ఉల్లంఘించిన బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకుంటున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI).. ఇప్పుడు ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పేకు భారీ జరిమానా విధించింది. 'ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్' (PPIs) కు సంబంధించిన కొన్ని నిబంధనలను పాటించనందుకు ఫోన్‌పే లిమిటెడ్‌కు 21 లక్షల రూపాయల జరిమానా విధించినట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.అక్టోబర్ 2023 నుంచి డిసెంబర్ 2024 వరకు కంపెనీ కార్యకలాపాలకు సంబంధించి సెంట్రల్ బ్యాంక్ చట్టబద్ధమైన తనిఖీ నిర్వహించినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలను పాటించకపోవడం మాత్రమే కాకుండా.. ఈ విషయంలో సంబంధిత ఉత్తర ప్రత్యుత్తరాలను పాటించలేదని ఆర్బీఐ వెల్లడించింది. ఈ కారణంగానే ఫోన్‌పేకు నోటీస్ జారీ చేయడం జరిగిందని స్పష్టం చేసింది. జరిమానా విధించినప్పటికీ.. ఇది యూజర్లపై ఎటువంటి ప్రభావం చూడదని పేర్కొంది.ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ఫోన్‌పే వంటి అన్ని నాన్ బ్యాంకింగ్స్, ఎస్క్రో బ్యాలెన్స్‌లలో ఏదైనా లోటు ఉంటే వెంటనే రిజర్వ్ బ్యాంక్ పేమెంట్స్ & సెటిల్మెంట్ సిస్టమ్స్ విభాగానికి (DPSS) నివేదించాలి. ఎస్క్రో ఖాతా నిల్వలు.. రోజు చివరిలో వ్యాపారులకు చెల్లించాల్సిన బకాయి ఉన్న PPIల విలువ, చెల్లింపుల కంటే తక్కువగా ఉండకూడదని నిబంధనలు పేర్కొంటున్నాయి.ఇదీ చదవండి: డీజిల్‌లో ఐసోబుటనాల్: కేంద్రమంత్రి కీలక ప్రకటనపీపీఐ మార్గదర్శకాలను పాటించనందుకు.. రిజర్వ్ బ్యాంక్ ఫోన్‌పేకు 2019లో రూ. కోటి, 2020లో నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ. 1.39 కోట్ల జరిమానా విధించింది. ఇప్పుడు మరో సారి రూ. 21 లక్షల జరిమానా విధించింది. -
మహేష్ బ్యాంకుకు ఆర్బీఐ భారీ జరిమానా
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏపీ మహేష్ అర్బన్ కోపరేటవ్ బ్యాంకుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) భారీ విధించింది. సైబర్ భద్రతను నిర్లక్ష్యం చేసినందుకు గానూ రూ. 65 లక్షల జరిమానా విధిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది జనవరి 24న మహేష్ బ్యాంక్ సర్వర్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఖాతాదారులకు సంబంధించిన రూ. 12.48 కోట్లను వివిధ ఖాతాలకు నైజీరియన్ ముఠా బదిలీ చేసుకుంది. బ్యాంకు ప్రతినిధుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహేష్ బ్యాంకు యాజమాన్యం సైబర్ భద్రతను పూర్తిగా గాలికొదిలేసినట్లు సైబర్ క్రైం పోలీసులు విచారణలో తేల్చారు. సైబర్ నేరగాళ్లు బ్యాంకు సిబ్బందికి ఫిషింగ్ మెయిళ్లు పంపించి సర్వర్ లోకి చొరబడినట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ వద్ద హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రస్తావించి ఆ బ్యాంకు లైసెన్సును రద్దు చేయాలని సూచించారు. అయితే లైసెన్స్ రద్దు న్యాయపరంగా వీలు కాకపోవడంతో ఆర్బీఐ మహేష్ బ్యాంకుకు భారీ జరిమానా విధించింది. సైబర్ భద్రత లోపాల కారణంగా ఆర్బీఐ జరిమానా విధించడం దేశంలో ఇదే తొలిసారి అని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇదీ చదవండి: సైబర్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా? రూ. కోటి వరకూ కవరేజీ.. -
ఐదు బ్యాంకులపై రూ. 10 కోట్ల జరిమానా
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రెగ్యులేటర్– ఆర్బీఐ ఐదు బ్యాంకులపై రూ.10 కోట్ల జరిమానా విధించింది. అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్, కెనరా బ్యాంక్‌లు ఇందులో ఉన్నాయి. నోస్ట్రో ఖాతాలకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించడంవల్ల ఆర్బీఐ అలహాబాద్ బ్యాంక్‌పై జరిమానా విధించింది. ఒక బ్యాంక్ వేరే బ్యాంక్‌లో విదేశీ కరెన్సీలో నిర్వహించే ఖాతాను నోస్ట్రో ఖాతాగా వ్యవహరిస్తారు. అంతర్జాతీయ మెసేజింగ్ సాఫ్ట్వేర్..స్విఫ్ట్‌కు సంబంధించిన నిబంధనల ఉల్లంఘనలకుగాను ఈ రెండు బ్యాంక్‌లపై ఆర్బీఐ చెరో కోటి రూపాయలు జరిమానా విధించింది. -
ఆర్బీఐ, సీబీఐ షాక్: ఐసీఐసీఐ ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయ ప్రయివేటు రంగ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐకు వరుస షాక్‌లు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. దేశీయ ఎలక్ట్రానిక్స్ సంస్థ వీడియోకాన్‌కు మంజూరు చేసిన రుణాలకు సంబంధించి కేసు నమోదు, సీబీఐ ప్రాథమిక దర్యాప్తు నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో ఐసీఐసీఐ షేర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. దాదాపు 6శాతం (5.6) పతనాన్ని నమోదు చేసింది. దీనికితోడు సెక్యూరిటీ విక్రయాల అంశంలో నియమాలను పాటించని కారణంగా ఆర్బీఐ విధించిన 58.9 కోట్ల రూపాయల జరిమానా కూడా ఐసీఐసీఐసీ బ్యాంకు నెత్తిన పిడుగులా పడింది. మరోవైపు దివాళా బాటలో వీడియోకాన్ షేరు సైతం 5 శాతంనష్టపోయి లోయర్ సర్క్యూట్‌ను తాకడం గమనార్హం. కాగా వీడియోకాన్‌కు రుణాలు మంజూరు చేసిన అంశంలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచ్చర్ పాత్రపై సీబీఐ విచారణ చేపట్టింది. వీడియోకాన్ గ్రూప్‌నకు వేలకోట్ల రుణాలిచ్చినందుకు గాను భారీ లబ్ది పొందారన్న ఆరోపణల నేపథ్యంలో చందా కొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూపు చైర్మన్ వేణుగోపాల్ ధూతపై సీబీఐ ప్రిలిమినరీ ఎంక్వైరీ(పీఈ) చేపట్టింది. వీడియోకాన్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ రుణాలు విడుదల చేయడంలో క్విడ్‌ప్రో కో జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో సీబీఐ కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. -
ఐదు విదేశీ బ్యాంకులపై ఆర్బీఐ జరిమానా
ముంబై: విదేశీ మారక నిర్వహణ (ఫెమా) నిబంధనల ఉల్లంఘనకు గాను ఐదు బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ జరిమానా విధించింది. డాయిష్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, బ్యాంక్ ఆఫ్ టోక్యోమిత్సుబిషి, ది రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ ఇందులో ఉన్నాయి. గతంలో ఇచ్చిన షోకాజ్ నోటీసులకు సంబంధించి ఆయా బ్యాం కులు ఇచ్చిన వివరణను పరిశీ లించినమీదట డాయిష్ బ్యాంక్‌పై రూ. 20,000,మిగతా బ్యాంకులపై తలో రూ. 10,000 జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది.