
ముంబై: డేటా లోకలైజేషన్ నిబంధనలపై రిజర్వ్ బ్యాంక్ స్పష్టతనిచ్చింది. పేమెంట్ సిస్టమ్ ఆపరేటింగ్ సంస్థలు (పీఎస్‌వో) చెల్లింపుల లావాదేవీల డేటా మొత్తం భారత్‌లోని సిస్టమ్స్‌లోనే భద్రపర్చాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అవసరమైతే డేటాను విదేశాల్లో ప్రాసెస్ చేయొచ్చని... కానీ దాన్ని 24 గంటల్లోగా భారత్‌కు మార్చాల్సి ఉంటుందని, విదేశీ సర్వర్ల నుంచి తొల గించాల్సి ఉంటుం దని తేల్చిచెప్పింది. చెల్లింపుల డేటాను భారత్‌లోనే భద్రపర్చాలన్న (డేటా లోకలైజేషన్) నిబంధనల మీద పీఎస్‌వోలు లేవనెత్తిన సందేహాలు నివృత్తి చేస్తూ ఆర్‌బీఐ ఈ మేరకు వివరణ ఇచ్చింది.