మంగుళూరుకీ మల్టినేషనల్ కీ లింకేమిటి? | Rajeev Suri is Nokia chief | Sakshi
Sakshi News home page

మంగుళూరుకీ మల్టినేషనల్ కీ లింకేమిటి?

Mar 14 2014 6:54 PM | Updated on Sep 2 2017 4:42 AM

మంగుళూరుకీ మల్టినేషనల్ కీ లింకేమిటి?

మంగుళూరుకీ మల్టినేషనల్ కీ లింకేమిటి?

మీరు మంగుళూరు యూనివర్సిటీలో చదువుకున్నారా? అయితే మీకు విశ్వ విఖ్యాత మల్టినేషనల్ కంపెనీకి గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయ్యే అవకాశాలు మెండుగానే ఉన్నాయి.

మీరు మంగుళూరు యూనివర్సిటీలో చదువుకున్నారా? అయితే మీకు విశ్వ విఖ్యాత మల్టినేషనల్ కంపెనీకి గ్లోబల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయ్యే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. అవును. మైక్రోసాఫ్ట్ కి మెగా హెడ్ అయిన సత్య నాదెళ్ల మంగుళూరు యూనివర్సిటీలో చదువుకున్నాడు. అన్నీ కలిసొస్తే నోకియా కార్పొరేషన్ కీ మంగుళూరు యూనివర్సిటీ విద్యార్థే కాబోతున్నాడు.

నోకియా టెలికామ్ ఎక్విప్ మెంట్ బిజినెస్ కి హెడ్ గా ఉన్న రాజీవ్ సూరి ఈ నెలాఖరుకి గ్లోబల్ హెడ్ గా హాట్ సీట్ లో కూర్చుంటారని తెలుస్తోంది. ఫిన్లండ్ కేంద్రంగా ఉండే రాజీవ్ సూరి మంగుళూరు యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్స్ లో ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకున్నారు. గత చాలా ఏళ్లుగా నోకియాలో పనిచేస్తున్నారు. దీంతో ప్రపంచప్రఖ్యాత మల్టినేషనల్స్ ని ముందుండి నడిపించే మహారథుల్లో మరొక మనోడు చేరాడు.

మల్టి నేషనల్స్ పై మనోళ్లదే పెత్తనం
 మైక్రోసాఫ్ట్  సత్యా నాదెళ్ల
 పెప్పికో  ఇందిరా నూయి
 రెకెట్ బెంకినేర్  రాకేశ్ కపూర్
 మాస్టర్ కార్డ్  అజయ్ బంగా
 డౌచ్ బ్యాంక్  అంశు జైన్
 హార్వర్డ్ కాలేజీ  రాకేశ్ ఖురానా
 డీబీఎస్ గుప్త  పీయూష్ గుప్త

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement