ఐబీఎస్ హైదరాబాద్‌కు ప్రతిష్టాత్మక ‘ఆస్కార్స్’ | prestigious 'Oscars' to hyderabad ibs | Sakshi
Sakshi News home page

ఐబీఎస్ హైదరాబాద్‌కు ప్రతిష్టాత్మక ‘ఆస్కార్స్’

Mar 6 2014 2:16 AM | Updated on Sep 2 2017 4:23 AM

హైదరాబాద్ ఐసీఎఫ్‌ఏఐ బిజినెస్ స్కూల్ ప్రతిష్టాత్మక కేస్ సెంటర్స్ వార్షిక బిజినెస్ ఎడ్యుకేషన్ ‘ఆస్కార్స్’ అవార్డును గెలుచుకుంది.

హైదరాబాద్: హైదరాబాద్ ఐసీఎఫ్‌ఏఐ బిజినెస్ స్కూల్ ప్రతిష్టాత్మక కేస్ సెంటర్స్ వార్షిక బిజినెస్ ఎడ్యుకేషన్ ‘ఆస్కార్స్’ అవార్డును గెలుచుకుంది. ఒక ప్రత్యేక అంశానికి సంబంధించి అత్యుత్తమ అధ్యయనం, లేఖనానికి ప్రపంచ స్థాయిలో ఈ అవార్డు గుర్తింపును ఇస్తుంది. ‘‘డిజిటల్ మార్కెటింగ్ ఎట్ నైక్: ఫ్రం కమ్యూనికేషన్ టు డైలాగ్’’ శీర్షికన జరిపిన కేస్ స్టడీకి ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.

‘‘నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ మేనేజ్‌మెంట్’ విభాగంలో ఈ కేస్ అవార్డును పొందినట్లు ఒక ప్రకటన తెలిపింది. పోటీపూర్వక మార్కెట్‌లో సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా ప్రపంచస్థాయి స్పోర్ట్స్‌వేర్ దిగ్గజం నైక్ ఎలా విజయం సాధించగలిగిందన్నది అధ్యయన సారాంశం.

Advertisement
 
Advertisement
Advertisement