టారిఫ్‌లను పోల్చి చూసుకోవడానికి పోర్టల్‌

Portal to compare tariffs - Sakshi

న్యూఢిల్లీ: టెలికం కంపెనీల టారిఫ్‌లను పోల్చి చూసుకోవడానికి టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌ తాజాగా ఒక పోర్టల్‌ను ఆవిష్కరించింది. ఇది బీటా వెర్షన్‌. టెలికం సర్వీస్‌ ప్రొవైడర్లు అందించే టారిఫ్‌ల వివరాలను ఒకే చోట అందించాలనే లక్ష్యంతో ట్రాయ్‌ www.tariff.trai.gov.in పేరిట ఈ పోర్టల్‌ను తీసుకువచ్చింది.

పలు రకాల టారిఫ్‌ ప్లాన్స్‌ను, ఇతర టారిఫ్‌ ఇన్‌స్ట్రూమెంట్స్‌ను డౌన్‌లోడ్‌ ఫార్మాట్‌ రూపంలో వెబ్‌సైట్‌లో ఉంచుతామని తెలిపింది. తొలి దశలో ఈ సేవలను ఢిల్లీ సర్కిల్‌లో అందుబాటులో ఉంచామని, యూజర్లు ఈ సర్వీసుపై ఫీడ్‌బ్యాక్‌ అందించాలని కోరింది. సేవలను తర్వాత దశలవారీగా ఇతర సర్కిళ్లకు విస్తరిస్తామని పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top