పెట్రో భారాల నుంచి స్వల్ప ఊరట.. | Petrol And Diesel prices Have Seen A Fall For Most Parts Of This Week | Sakshi
Sakshi News home page

పెట్రో భారాల నుంచి స్వల్ప ఊరట..

Oct 26 2018 10:41 AM | Updated on Oct 26 2018 10:41 AM

Petrol And Diesel prices Have Seen A Fall For Most Parts Of This Week - Sakshi

స్వల్పంగా తగ్గిన పెట్రోల్‌ ధరలు

సాక్షి, న్యూఢిల్లీ : రికార్డు స్ధాయిలో పరుగులు పెట్టిన పెట్రో ఉత్పత్తుల ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. వారం రోజులు పైగా వరుసగా తగ్గుతున్న పెట్రో ధరలు శుక్రవారం సైతం స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర లీటర్‌కు 27 పైసలు తగ్గి రూ 85.71కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ ధరలు లీటర్‌కు 25 పైసలు తగ్గి రూ 80.85కు చేరగా, ముంబైల్‌ పెట్రోల్‌ లీటర్‌కు రూ 86.33కు దిగివచ్చింది.

ఇక డీజిల్‌ లీటర్‌కు ఏడు పైసలు తగ్గి దేశ రాజధాని ఢిల్లీలో రూ 74.73 పలికింది. ముంబైలో డీజిల్‌ ధర లీటర్‌కు ఎనిమిది పైసలు తగ్గి రూ 78.33కు చేరింది. భగ్గుముంటున్న పెట్రో ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు అక్టోబర్‌ 4న పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ సుంకాన్ని లీటర్‌కు రూ 1.50 మేర తగ్గిస్తున్నట్టు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement