పెన్షన్ చెల్లింపులు వేగంగా జరపండి! | Pension payments, have faster! | Sakshi
Sakshi News home page

పెన్షన్ చెల్లింపులు వేగంగా జరపండి!

Aug 8 2015 1:08 AM | Updated on Sep 3 2017 6:59 AM

పెన్షన్ చెల్లింపులు వేగంగా జరపండి!

పెన్షన్ చెల్లింపులు వేగంగా జరపండి!

పాలసీదారులకు పెన్షన్ చెల్లింపుల్లో ఆలస్యం చెయొద్దని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ బీమా కంపెనీలను

బీమా కంపెనీలను ఆదేశించిన ఐఆర్‌డీఏ
 
 న్యూఢిల్లీ : పాలసీదారులకు పెన్షన్ చెల్లింపుల్లో ఆలస్యం చెయొద్దని బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏ బీమా కంపెనీలను ఆదేశించింది. ఇం దుకోసం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. పెన్షన్ ఉత్పత్తులను తీసుకున్న పాలసీదారులతో చర్చలు జరపాలని బీమా కంపెనీలకు తెలియజేసింది. ఈ చర్చల్లో పాలసీదారులు వారి పెన్షన్ చెల్లింపుల కోసం ఏలాంటి ఆప్షన్ కోరుకుంటారో బీమా కంపెనీలు తెలుసుకుంటాయి.

అలాగే సదరు బీమా కంపెనీ పెన్షన్‌ను ఏ విధానంలో చెల్లిస్తుందో పాలసీదారులకు 6 నెలల ముందే తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ పాలసీదారులు ఎలాంటి ఆప్షన్ ఇవ్వకపోతే.. అప్పుడు బీమా కంపెనీ ఆ పాలసీదారు బీమా తీసుకునే సమయంలో ఇచ్చిన సమాచారం ఆధారంగా చెల్లింపులు జరుపుతుంది. అలాగే నిబంధనలను అతిక్రమించడంతో రిలయన్స్ లైఫ్‌కు ఐఆర్‌డీఏ రూ.85 లక్షల జరిమానా విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement