ఈ రోజుల్లో దాదాపు అందరూ బీమా తీసుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ప్రమాదం జరిగినప్పుడు.. కొన్ని కారణాలను చూపిస్తూ బీమా సంస్థలు పరిహారం చెల్లించకుండా తప్పించుకుంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని 'వాహనం రూట్ ఉల్లంఘన జరిగినా కూడా, ప్రమాద బాధితుడికి బీమా కంపెనీలు పరిహారం చెల్లించాల్సిందే' అంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
ప్రమాదం జరిగిన సమయంలో.. వాహనం రూట్ మారిందని ప్రమాద బాధితులకు బీమా కంపెనీ పరిహారాన్ని తిరస్కరించకూడదు. సాంకేతిక అంశాలను పరిగణలోకి తీసుకుని బీమాను తిరస్కరించలేరు. ప్రమాద బాధితుడికి న్యాయం చేయడమే బీమా ముఖ్య ఉద్దేశం. బీమా చెల్లించిన తరువాత.. ఏవైనా అవకతవకలు ఉంటే.. రూల్స్ ఉల్లంఘించిన వాహన యజమానిపై లేదా డ్రైవర్ నుంచి రికవరీ చేసుకోవచ్చు. కాబట్టి ముందుగా ప్రమాద బాధితులకు పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.


