భారత్‌లోనే పేమెంట్స్‌ డేటా స్టోరేజి: వాట్సాప్‌

Payments Data Storage in India: Whatsapp - Sakshi

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ నిబంధనలకు అనుగుణంగా చెల్లింపుల సంబంధిత డేటాను భారత్‌లోనే భద్రపర్చేలా (డేటా లోకలైజేషన్‌) తగు వ్యవస్థను రూపొందించుకున్నట్లు మొబైల్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫాం వాట్సాప్‌ వెల్లడించింది. ప్రస్తుతం దేశీయంగా పది లక్షల మందితో ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.

త్వరలోనే దేశవ్యాప్తంగా అందరికీ దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వాట్సాప్‌నకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 130 కోట్ల మంది యూజర్లు ఉండగా అందులో 20 కోట్ల మంది యూజర్లు భారత్‌లోనే ఉన్నారు. చెల్లింపు సేవలు అందించే సంస్థలన్నీ తత్సంబంధిత డేటాను భారత్‌లోనే స్టోర్‌ చేయాలంటూ ఆదేశించిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఇందుకోసం అక్టోబర్‌ 15 దాకా గడువునిచ్చింది. దీనికి అనుగుణంగానే వాట్సాప్‌ తాజా ప్రకటన విడుదల చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top