నూతన దివాలా చట్టంతో రుణ ఎగవేతదారులకు చుక్కలు తప్పవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు.
ముంబయిః రుణ ఎగవేతదారులను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీవ్రంగా హెచ్చరించారు.నూతన దివాలా చట్టం అమల్లోకి వచ్చిన క్రమంలో రుణ ఎగవేతదారులకు బకాయి సొమ్ము చెల్లించడం లేదా యాజమాన్య బాధ్యతల నుంచి వైదొలగడం రెండే మార్గాలున్నాయని స్పష్టం చేశారు.దివాలా చట్టం వర్తింప చేసే ప్రక్రియలో వాణజ్య కార్యకలాపాలు నిలిచిపోతాయనే అపోహ సరైంది కాదని జైట్లీ వివరణ ఇచ్చారు.
దివాలా చట్టంతో రుణ ఎగవేతదారు నుంచి బకాయిల వసూలు జరగడంతో పాటు నూతన భాగస్వామి పర్యవేక్షణలో సంస్థ ఆస్తులను పరిరక్షిస్తారని తెలిపారు. నూతన దివాలా చట్టంతో రుణదాతలు, రుణగ్రహీతల మధ్య సంబంధాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపారు.ఈ చట్టం కింద న్యాయస్థానాల్లో వెల్లడయ్యే తీర్పులు వాటి అమలును పర్యవేక్షించిన అనంతరం ఆ అనుభవాల ఆధారంగా చట్టంలో ఎలాంటి మార్పులు అవసరమైతే వాటిని చేపడతామని మంత్రి చెప్పారు.