భారీ బ్యాటరీ, ఆకర్షణీయమైన ధర: కొత్త మొబైల్‌

Panasonic India launches 'Eluga A4' at Rs 12,490 - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: పానసోనిక్‌ ఇండియా కొత్త  మొబైల్‌లాంచ్‌  చేసింది.  బడ్జెట్‌ ధర సెగ్మెంట్‌లో  మరో స్మార్ట్‌ఫోన్‌ను  భారతీయులకు అందుబాటులోకి తెచ్చింది. ఎలుగా  సిరీస్‌లో భారీ బ్యాటరీతో అందుబాటు ధరలో  ‘ఎలుగా ఎ 4’ పేరుతో సోమవారం దీన్ని  మార్కెట్లో విడుదల చేసింది.  దీని ధర రూ.12,490గా  వెల్లడించింది.

 ‘ఎలుగా ఎ 4’  ఫీచర్లు
5.2 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ నౌగట్‌ 7.0
13 ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
1.25 గిగి హెడ్జ్‌  క్వాడ్‌ కోర్‌ ప్రాససర్‌
3 జీబీ  ర్యామ్‌
32 జీబీ స్టోరేజ్‌
128 దాకా విస్తరించుకునే అవకాశం
5000 ఎంఏహెచ్‌బ్యాటరీ
అత్యాధునిక  చిప్‌తో  రూపొందించి, సరసమైన ధరలో వినియోగదారులకు  అందుబాటులోకి తీసుకొచ్చామని  పానసోనిక్‌ ఇండియా బిజినెస్‌హెడ్‌ పంకజ్‌ రానా ప్రకటించారు. త్రీ కలర్‌ వేరియంట్స్‌లో భారత్‌ అంతా తమ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చని తెలిపారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top