పీజీఐఎం నుంచి ఓవర్‌నైట్‌ ఫండ్‌

Over night Funds From PGIM - Sakshi

ఓవర్‌నైట్‌ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేసే లక్ష్యంతో పీజీఐఎం ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ (లోగడ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమెరికా) నుంచి ఓవర్‌నైట్‌ ఫండ్‌ అందుబాటులోకి వచ్చింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకం. ఈ నెల 12న ఆఫర్‌ ప్రారంభం కాగా, ఈ నెల 26 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. ఒక్క రోజు వ్యవధిలో గడువు తీరే ఓవర్‌నైట్‌ సెక్యూరిటీల్లో (డెట్‌ సెక్యూరిటీలు, మనీ మార్కెట్‌ ఇనుస్ట్రుమెంట్లు) ఈ పథకం ఇన్వెస్ట్‌ చేస్తుంది. స్వల్ప కాలం కోసం నిధులను పార్క్‌ చేసుకోవాలనుకునే వారికి ఇది అనుకూలం. రిస్క్‌ తక్కువగా ఉంటుంది. అధిక లిక్విడిటీ (కోరుకున్నప్పుడు వేగంగా వెనక్కి తీసుకోగలగడం) ఇందులోని మరో సానుకూలత. అయితే, రాబడులకు హామీ ఉండదు. ప్రవేశం, వైదొలిగే సమయంలో ఎటువంటి చార్జీలు ఉండవు. ఒక రోజు నుంచి నెల రోజుల వరకు తమ నిధులపై రాబడులు కోరుకునే వారు ఈ తరహా పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top