ఫేస్‌ స్లిమ్మింగ్‌ ఫీచర్‌తో ఒప్పో ఏ9 | OPPO A9 launched in India for Rs 15490  | Sakshi
Sakshi News home page

ఫేస్‌ స్లిమ్మింగ్‌ ఫీచర్‌తో ఒప్పో ఏ9

Jul 18 2019 2:41 PM | Updated on Jul 18 2019 2:47 PM

OPPO A9 launched in India for Rs 15490  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: చైనా  స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఒప్పో  ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఒప్పో ఏ9 పేరుతో  ఈ  స్మార్ట్‌ఫోన్‌ను గురువారం విడుదల చేసింది.  ఒప్పో ఏ9 ధరను రూ. 15,490 గా నిర్ణయించింది.  జులై 20 నుంచి భారత మార్కెట్లలో  కొనుగోలుకు లభ్యం కానుంది. 

ఒప్పో ఏ 9 ఫీచర్లు
6.35 ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే
కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌
1080x2340 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
ఆక్టాకోర్ మీడియాటెక్ హెలియో పి 70 ప్రాసెసర్‌
4జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌
16ఎంపీ+2 ఎంపీ  డ్యుయల్‌ రియర్‌ కెమెరా
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
4020 ఎంఏహెచ్‌ బ్యాటరీ

వినియోగదారులకు సరసమైన ధరలో  అసాధారణమైన అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని ఒప్పో  ఇండియా సీఈవో  చార్లెస్ వాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా సెల్ఫీ కెమెరాలో 130 ఫోర్‌హెడ్‌ పాయింట్స్‌ను గుర్తించడంతోపాటు, ఫేస్‌ స్లిమ్మింగ్‌  పీచర్‌ లాంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్నిజోడించినట్టు చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement