వన్‌ప్లస్‌ 6 లాంచ్‌, అదిరిపోయే ఫీచర్లు

OnePlus 6, OnePlus 6 Marvel Avengers Limited Edition Announced In India - Sakshi

ముంబై : చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వన్‌ప్లస్ తన నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్‌ 6ను నేడు(గురువారం) భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. ముంబై వేదికగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. వన్‌ప్లస్‌ 6 తోపాటు వన్‌ప్లస్‌ 6 మార్వెల్‌ అవెంజర్స్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ వేరియంట్‌ను కూడా నేడు ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను నిన్ననే లండన్‌లో లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. నేడు భారత్‌లో లాంచ్‌ చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్‌ 6 అచ్చం ఐఫోన్‌ ఎక్స్‌ మాదిరి నాచ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. అంతా గ్లాస్‌తో వచ్చిన తొలి వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ కూడా ఇదే కావడం విశేషం. ఈ లాంచ్‌ ఈవెంట్‌లోనే కంపెనీ ఐదు కొత్త వన్‌ప్లస్‌ ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్లను, 10 కొత్త సర్వీసు సెంటర్లను కూడా ప్రకటించింది. 

వన్‌ప్లస్‌ 6 ధర
వన్‌ప్లస్‌ 6 ప్రస్తుతం రెండు స్టోరేజ్‌ వేరియంట్లలో భారత మార్కెట్‌లోకి వస్తోంది. 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.34,999 కాగ, 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 39,999 రూపాయలు. 256జీబీ వేరియంట్‌ భారత్‌కు రావడం లేదు. మూడు రంగులు మిడ్‌నైట్‌ బ్లాక్‌, మిర్రర్‌ బ్లాక్‌, సిల్క్‌ వైట్‌ లిమిటెడ్‌ ఎడిషన్లలో ఈ ఫోన్‌ లభ్యమవుతోంది. వన్‌ప్లస్‌ 6 మార్వెల్‌ అవెంజర్స్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ ధర రూ.44,999గా కంపెనీ నిర్ణయించింది. మార్వెల్‌ అవెంజర్స్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ను అమెజాన్‌లో మే 29 నుంచి ఓపెన్‌ సేల్‌కు ఉంచనుంది. 

వన్‌ప్లస్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ మాత్రం దేశవ్యాప్తంగా ఎనిమిది పాప్‌ అప్‌ స్టోర్లలో విక్రయానికి వస్తుంది. మే 21న మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 8 గంటల వరకు, అదేవిధంగా మే 22న ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ఫోన్‌ అందుబాటులో ఉండనుంది. ఆన్‌లైన్‌ అమెజాన్‌లో మే 21న తొలుత అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్ల కోసం అందుబాటులో ఉంచనున్నారు. అనంతరం ఓపెన్‌ సేల్‌కు రానుంది. వన్‌ప్లస్‌ స్టోర్‌ ద్వారా ఈ ఫోన్‌ లభ్యమవనుంది. 

వన్‌ప్లస్‌ 6 స్పెషిఫికేషన్లు
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఆధారిత ఆక్సీజెన్‌ఓఎస్‌ 5.1
డ్యూయల్‌-సిమ్‌(నానో)
6.28 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఫుల్‌ ఆప్టిక్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే
84 శాతం స్క్రీన్‌ టూ బాడీ రేషియో
గొర్రిల్లా గ్లాస్‌ 5
క్వాల్‌కామ్‌ 845 ఎస్‌ఓసీ
6జీబీ ర్యామ్‌ లేదా 8జీబీ ర్యామ్‌
16 మెగాపిక్సెల్‌, 20 మెగాపిక్సెల్స్‌తో డ్యూయల్‌ రియర్‌ కెమెరా
16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌(0.4 సెకన్లలో అన్‌లాక్‌)
వెనుకవైపు ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ 
64జీబీ, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్లు
3300ఎంఏహెచ్‌ బ్యాటరీ
వన్‌ప్లస్‌ 6 మార్వెల్‌ అవెంజర్స్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌
ఈ స్మార్ట్‌ఫోన్‌ను రెగ్యులర్‌ వేరియంట్లతో కలిపి లాంచ్‌ చేసింది. 8జీబీ ర్యామ్‌ను, 256జీబీ స్టోరేజ్‌ను దీనిలో ఆఫర్‌చేస్తోంది. గొర్రిల్లా గ్లాస్‌ 5 కవరింగ్‌, గోల్డ్‌ వన్‌ప్లస్‌, వెనుక వైపు అవెంజర్స్‌ లోగోలు ఉన్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top