శాంసంగ్‌ ప్లాంట్‌లో ప్రమాదం : గ్యాస్‌ లీక్‌...

One Dead, Two Injured in Gas Leak At Samsung Chip Plant - Sakshi

శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ చిప్‌ ప్లాంట్‌లో ప్రమాదం సంభవించింది. కార్బన్‌ డయాక్సైడ్‌ లీక్‌ అయి ఒకరు మృతి చెందగా.. ఇద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. సియోల్‌కు దక్షిణం పక్కనున్న సువోన్‌లోని సెమీ కండక్టర్‌ ప్యాక్టరీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ చిప్‌ ప్లాంట్‌లో ఒక్కసారిగా గ్యాస్‌ లీకై, కార్బన్‌ డయాక్సైడ్‌ అంతా ప్లాంట్‌వ్యాప్తంగా వ్యాపించింది. దీంతో ఆ ప్లాంట్‌లో పనిచేస్తున్న ముగ్గురు వర్కర్లు అపస్మారక స్థితిలోకి వెళ్లారని దక్షిణ కొరియాకు చెందిన ఈ కంపెనీ తెలిపింది. వీరిలో 24 ఏళ్ల ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించాడు. 26, 54 ఏళ్ల వయసున్న మిగిలిన ఇద్దరు అపస్థారక స్థితిలో ఉన్నట్టు తెలిసింది. 

కార్బన్‌ డయాక్సైడ్‌ లీక్‌ కావడంతో, గాలి పీల్చుకోలేక ఉక్కిరిబిక్కిరి అయి, ఒకరు ప్రాణాలు విడిచినట్టు శాంసంగ్‌ తెలిపింది. ఈ ప్రమాదంపై విచారణ చేపట్టినట్టు కూడా పేర్కొంది. శాంసంగ్‌ ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌, మెమరీ చిప్‌ల తయారీదారి. ఇటీవల కాలంలో దిగ్గజ కంపెనీల్లో పెద్ద పెద్ద ప్రమాదాలు చేసుకోవడం తరచు వార్తల్లో నిలుస్తున్నాయి. ఫ్యాక్టరీల్లో సురక్షితమైన పద్ధతులను మెరుగుపరచడానికి కంపెనీలు తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ, ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ దేశంలో టాప్‌ స్టీల్‌ తయారీ కంపెనీ పోస్కోలో కూడా గ్యాస్‌ లీకై, నలుగురు వర్కర్లు చనిపోయారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top