అక్కడ ఓలా, ఉబెర్‌కు షాక్‌!

Ola Uber to have a competitor in city  - Sakshi

బెంగళూరులో కొత్త క్యాబ్‌ సేవల సంస్థ

హోయసాల క్యాబ్స్‌, డ్రైవర్లకు బంపర్‌ ఆఫర్లు

సాక్షి, బెంగళూరు:  క్యాబ్‌ సేవల సంస్థలు ఓలా, ఉబెర్‌కు  గట్టి పోటీ  ఎదురు కానుంది. బెంగళూరులో మరో కొత్త క్యాబ్‌ అగ్రిగేటర్‌ రంగంలోకి దిగుతోంది. క్యాబ్‌ సేవల మార్కెట్‌ను ఏలుతున్న ఈ దిగ్గజాలకు  నగరంలో భారీ షాక్‌ తగలనుంది. ‘హోయసాల క్యాబ్స్‌’ పేరుతో  కొత్త క్యాబ్‌ సంస్థ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.  అటు ప్రయాణీకులకు, ఇటు డ్రైవర్లకు మంచి ప్రయోజనాలు అందించనున్నామని కంపెనీ చెబుతోంది.

రూ. 6 కోట్ల పెట్టుబడితో నగరంలో క్యాబ్‌ సేవలను సెప్టెంబర్‌ 1 నుంచి లాంచ్‌ చేయనుంది హోయసాల క్యాబ్స్‌. ఈ మేరకు ఒకమొబైల్‌ యాప్‌ను కూడా రూపొందించామని  సంస్థ ప్రతినిధి ఉమా శంకర్‌ తెలిపారు.  ప్యాసింజర్లు,  డ్రైవర్లు ఇద్దరికీ తమ సంస్థ ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. అలాగే ‘పీక్‌ హవర్‌ చార్జీ’ పేరుతో అదనపు చార్జిని తాము వసూలు చేయబోమని వెల్లడించారు. 2500కు పైగా  క్యాబ్స్‌, మరింత ఎక్కువమంది డ్రైవర్లు,  తన ప్లాట్‌ఫాంలో చేరతారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు కంపెనీ  సీవోవో జయసింహ. అంతేకాదు తమ డ్రైవర్లకు  నగదు  బహుమతులకు బదులుగా,  ఉచిత తీర్థయాత్రలు,  పిల్లలకు స్టడీ స్కాలర్‌షిప్‌లు,  ఉచిత ఇంగ్లీష్ లెర్నింగ్ తరగతులను అందించనున్నట్లు ఆయన తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top