మైక్రోమ్యాక్స్ నుంచి కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్ | Now, Micromax launches 4G smartphone | Sakshi
Sakshi News home page

మైక్రోమ్యాక్స్ నుంచి కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్

Nov 19 2015 12:41 AM | Updated on Sep 3 2017 12:40 PM

మైక్రోమ్యాక్స్ నుంచి కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్

మైక్రోమ్యాక్స్ నుంచి కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్

ప్రస్తుతం మొబైల్ ఫోన్ మార్కెట్‌లో 4జీ స్మార్ట్‌ఫోన్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో..ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్ల తయారీ కంపెనీ ‘మైక్రోమ్యాక్స్’

న్యూఢిల్లీ: ప్రస్తుతం మొబైల్ ఫోన్ మార్కెట్‌లో 4జీ స్మార్ట్‌ఫోన్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో..ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్ల తయారీ కంపెనీ ‘మైక్రోమ్యాక్స్’ తొలిసారిగా ‘కాన్వాస్‌ఎక్స్‌ప్రెస్4జీ’ పేరుతో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర రూ.6,599. ‘కాన్వాస్‌ఎక్స్‌ప్రెస్4జీ’ స్మార్ట్‌ఫోన్లు వినియోగదారులకు ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని కంపెనీ పేర్కొంది.
 టాప్ 10లో మైక్రోమ్యాక్స్: జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో మైక్రోమ్యాక్స్ అమ్మకాలు రెట్టింపయ్యాయి. 56 లక్షల నుంచి 1.21 కోట్లకు పెరిగాయని రీసెర్చ్ సంస్థ గార్ట్‌నర్ తెలిపింది. దీంతో అంతర్జాతీయంగా టాప్ 10 దిగ్గజ కంపెనీల్లో మైక్రోమ్యాక్స్ కూడా చోటు దక్కించుకున్నట్లు వివరించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement