99 రూపాయలకే నోకియా స్మార్ట్‌ఫోన్‌ | Nokia smartphones available at Rs 99 | Sakshi
Sakshi News home page

99 రూపాయలకే నోకియా స్మార్ట్‌ఫోన్‌

Oct 17 2018 11:01 AM | Updated on Oct 17 2018 1:39 PM

Nokia smartphones available at Rs 99 - Sakshi

న్యూఢిల్లీ : ఈ - కామర్స్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ బిగ్‌ షాపింగ్‌ సీజన్‌ ముగిసి రెండు రోజులు కావోస్తుంది. అయ్యో ఇక మీదట తక్కువ ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొందామంటే ఇక కుదరదేమో అని నిరాశ పడుతున్నారా..? అయితే ఇది మీ కోసమే. నోకియా బ్రాండెడ్‌ స్మార్ట్‌ఫోన్లను విక్రయిస్తున్న హెచ్‌ఎండీ గ్లోబల్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. కేవలం 99 రూపాయల డౌన్‌పేమంట్‌లో ఎంపిక చేసిన నోకియా బ్రాండెడ్‌ స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయవచ్చని హెచ్‌ఎండీ గ్లోబల్‌ తెలిపింది. మిగతా మొత్తాన్ని నో - కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌లో నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్‌లో చెల్లించవచ్చని పేర్కొంది.

ఈ ఆఫర్‌ 2018 నవంబర్‌ 10 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ ఆఫర్‌లోనే హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డులపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ అందుబాటులో ఉంటుంది. హెచ్‌ఎండీ గ్లోబల్‌ లైనప్‌లో అందుబాటులో ఉన్న ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ నోకియా 8 సిరాకో పై హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుదారులకు 15 శాతం క్యాష్‌బ్యాక్‌ లభిస్తోంది. అయితే ఈ క్యాష్‌బ్యాక్‌ కార్పొరేట్‌, బిజినెస్‌, కమర్షియల్‌ క్రెడిట్‌ కార్డులకు వర్తించదు.

నోకాస్ట్‌ ఈఎంఐలో రూ.99కే అందుబాటులో ఉన్న ఫోన్లు...
నోకియా 1, నోకియా 2.1, నోకియా 5.1, నోకియా 6.1, నోకియా 3.1 ప్లస్, నోకియా 8 సిరాకో. నోకియా 3.1ప్లస్‌ను ఇటీవలే లాంచ్‌ చేసింది.

ఆఫర్‌ పొందడమెలా..?
ఈ ఆఫర్‌ని పొందాలనే ఆసక్తి ఉన్న వారు దగ్గరలోని రిలయన్స్‌ జియో, జియో డిజిటల్‌ లైఫ్, క్రోమా స్టోర్‌లలో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు కనుగొనవచ్చు. అంతేకాక అధికారిక నోకియా ఆన్‌లైన్‌ స్టోర్‌లో కూడా ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement