ఆపిల్‌ ఐ ఫోన్‌తో పోటీ.. తనకు తనే సాటి | Nokia 8 with dual rear cameras, Qualcomm Snapdragon 835 launched | Sakshi
Sakshi News home page

ఆపిల్‌ ఐ ఫోన్‌తో పోటీ.. మాకు మేమే సాటి

Aug 17 2017 4:26 PM | Updated on Aug 20 2018 2:58 PM

ఆపిల్‌, శాంసంగ్‌ లాంటి దిగ్గజ కంపెనీలను నిలువరించి మార్కెట్‌లో రారాజుగా వెలిగేందుకు మళ్లీ రంగంలోకి వచ్చిన నోకియా తన ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ నోకియా 8ను బుధవారం లాంచ్‌ చేసింది.



న్యూఢిల్లీ:
ఆపిల్‌, శాంసంగ్‌ లాంటి దిగ్గజ కంపెనీలను నిలువరించి మార్కెట్‌లో రారాజుగా వెలిగేందుకు మళ్లీ రంగంలోకి వచ్చిన నోకియా తన ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌ నోకియా 8ను బుధవారం లాంచ్‌ చేసింది. ఇందుకు సంబంధించి ఓ ప్రోమో వీడియోను విడుదల చేసింది. ఆపిల్‌ ఐ ఫోన్‌ 8, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 8లు మార్కెట్లో నోకియా 8 దెబ్బకు కుదేలవుతాయని నిపుణులు భావిస్తున్నారు. విడుదలైన ఫోన్‌ వచ్చే నెల నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుంది. డ్యుయల్‌ లెన్స్‌ కెమెరా ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంది.  డ్యుయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌తో, మార్కెట్‌లోని లీడింగ్‌ ప్రాసెసర్‌లలో ఒకటైన స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌ ప్రధాన ఆకర్షణగా నోకియా 8 విడుదలైంది.

బ్లూ, గోల్డ్‌ బ్లూ, గోల్డ్‌ కాపర్‌, స్టీల్‌ కలర్‌ ఆప్షన్స్‌లో ఇది లభ్యం కానుంది. రెండు వేరియంట్లలో (6జీబీ-128 జీబీ స్టోరేజ్‌, 4 జీబీ ర్యామ్‌- 64 జీబీ స్టోరేజ్‌) నోకియా 8 అందుబాటులోకి వస్తుంది. అంతే కాదు వచ్చే ఏడాది 8 జీబీ వేరియంట్‌ను కూడా లాంచ్‌ చేసేందుకు నోకియా సన్నాహాలు చేస్తోంది. దీని  ధర రూ.45,200/-లు గా ఉంటుందని భావిస్తున్నారు.

నోకియా 8 ఫీచర్స్‌

5.3 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే
1440 x 2560  రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 7.1.1 నౌగట్‌
4 జీబి ర్యామ్‌
64 జీబి ఇంటర్నల్‌ స్టోరేజ్‌
256 జీబీ వరకు విస్తరణ మెమరీ
13 ఎంపీ డబుల్‌ రియర్‌ కెమెరా(4కే వీడియో)
13 మెగా పిక్సెల్  ఫ్రంట్  కెమెరా
 3090 ఎంఏహెచ్‌  బ్యాటరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement