నోకియా ఫోన్లపై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు | Nokia 6, Nokia 8 Available With Discounts, Cashbacks | Sakshi
Sakshi News home page

నోకియా ఫోన్లపై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు

Jan 8 2018 3:17 PM | Updated on Jan 8 2018 7:39 PM

Nokia 6, Nokia 8 Available With Discounts, Cashbacks  - Sakshi

ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌, తన ప్లాట్‌ఫామ్‌పై నోకియా మొబైల్‌ వీక్‌ నిర్వహిస్తోంది. నేటి అర్థరాత్రి నుంచి  ప్రారంభమైన ఈ మొబైల్‌ వీక్‌లో నోకియా 8, నోకియా 6 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఎక్స్చేంజ్‌ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐదు రోజుల పాటు అంటే జనవరి 12 వరకు ఈ మొబైల్‌ వీక్‌ను అమెజాన్‌ నిర్వహించనుంది. 

ఈ సేల్‌లో భాగంగా నోకియా 6, నోకియా 8 స్మార్ట్‌ఫోన్లపై ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ కింద రూ.1500 వరకు అమెజాన్‌ ఆఫర్‌ చేస్తోంది. ఈ ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌తో రూ.14,999గా ఉన్న నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌ రూ.13,499కు దిగొచ్చింది. అంతేకాక  రూ.36,999గా ఉన్న నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌ రూ.35,499కు తగ్గింది.  అంతేకాక ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్‌ కార్డు యూజర్లకైతే, అదనంగా ఫ్లాట్‌ రూ.1500 డిస్కౌంట్‌ అందుబాటులో ఉంటుంది. అయితే  ఈ ఆఫర్‌ అందుబాటులోకి రావాలంటే, కార్డుపై రూ.10వేల వరకు కొనుగోళ్లు జరపాల్సి ఉంటుంది. ఒక్కో కార్డుపై ఒక్కసారి మాత్రమే ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. 

ఒకవేళ నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌ పే వాడి కొనుగోలు చేస్తే, ఆ యూజర్లకు రూ.2000 క్యాష్‌బ్యాక్‌ లభించనుంది. అమేజింగ్‌ మొబైల్స్‌ లేదా గ్రీన్‌ మొబైల్స్‌లో మాత్రమే కొనుగోలు జరపాల్సి ఉంటుంది. అంతేకాక కస్టమర్లకు రూ.1500 ఐసీఐసీఐ ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌ లేదా రూ.2000 అమెజాన్‌ పే క్యాష్‌బ్యాక్‌ ఏదో  ఒకటి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎక్స్చేంజ్‌ ఆఫర్‌లో నోకియా 6ను కొనుగోలు చేస్తే మరో రూ.1000 డిస్కౌంట్‌ను కూడా అమెజాన్‌ ఆఫర్‌ చేస్తోంది. అంటే మొత్తంగా ఇరు స్మార్ట్‌ఫోన్లపై రూ.3000 వరకు క్యాష్‌బ్యాక్‌ లభించనుంది.


    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement