నోకియా 6పై రెండోసారి ధర తగ్గింపు | Nokia 6 3GB RAM Variant Gets Another Price Cut On Amazon India | Sakshi
Sakshi News home page

నోకియా 6పై రెండోసారి ధర తగ్గింపు

Apr 4 2018 9:03 AM | Updated on Jul 6 2019 3:18 PM

Nokia 6 3GB RAM Variant Gets Another Price Cut On Amazon India - Sakshi

నోకియా 6 3జీబీ ర్యామ్‌ వేరియంట్‌

నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌ 3జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర మరోసారి తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను హెచ్‌ఎండీ గ్లోబల్‌ రూ.12,999కు తగ్గించింది. గతేడాది జూన్‌లో లాంచ్‌ అయినప్పుడు ఈ ఫోన్‌ ధర 14,999 రూపాయలుగా ఉండేది. గత నెలలో దీని ధరను 1500 రూపాయలు తగ్గించి, 13,499 రూపాయలకు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం అమెజాన్‌ ఇండియాలో దీని ధరను మరింత తగ్గించి రూ.12,999కు ఆఫర్‌ చేస్తోంది. ఈ కొత్త ధర నోకియా 6 3జీబీ ర్యామ్‌ వేరియంట్‌ సిల్వర్‌, మేట్‌ బ్లాక్‌ రంగుల ఆప్షన్లకు అందుబాటులో ఉంది. నోకియా 6(2018) స్మార్ట్‌ఫోన్‌ లాంచింగ్‌కు కొన్ని గంటల ముందు ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను హెచ్‌ఎండీ గ్లోబల్‌ తగ్గించింది. ఈ కొత్త ధరతో పాటు అమెజాన్‌ ఇండియాలో అందుబాటులో ఉన్న ఎక్స్చేంజ్‌ ఆఫర్‌తో నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌ అత్యంత తక్కువగా రూ.9,915కే లభ్యమవుతోంది. నోకియా 6 3జీబీ ర్యామ్‌తో పాటు 4జీబీ ర్యామ్‌ వేరియంట్‌ కూడా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. 16,999 రూపాయలుగా ఉన్న దీని ధరను, కంపెనీ ఏ మాత్రం మార్పు చేయలేదు. 

నోకియా 6 ఫీచర్లు
డ్యూయల్‌ సిమ్‌, ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియా
5.5 అంగుళాల ఫుల్‌-హెచ్‌డీ డిస్‌ప్లే 
2.5డీ కర్వ్‌డ్‌ గొర్రిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌
ఆక్టా-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 430 ఎస్‌ఓసీ
16 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా సెన్సార్‌
8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా సెన్సార్‌
3జీబీ ర్యామ్‌, 32జీబీ ఆన్‌బోర్డ్‌ స్టోరేజ్‌
128జీబీ వరకు ఎక్స్‌పాండబుల్‌ మెమరీ
ఫ్రంట్‌ ఫేసింగ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement