నోకియా 5.1 ప్లస్‌ న్యూ వేరియంట్స్‌, ఎయిర్‌టెల్‌ ఆఫర్‌

Nokia 5.1 Plus in 4GB, 6GB RAM Versions Now Aavailable on Nokia Store, Flipkart - Sakshi

సాక్షి,  ముంబై :  హెచ్‌ఎండీ గ్లోబల్‌ సంస్థ నోకియా 5.1 ప్లస్‌ మోడల్‌లో అధిక ర్యామ్‌, స్టోరేజీతో రెండు కొత్త వేరియంట్లను విడుదల చేసింది. ఇప్పటి వరకు 3జీబీ ర్యామ్‌, 32 జీబీ రామ్‌ మోడల్‌ మాత్రమే ఉండేది. తాజాగా 4జీబీ/64జీబీ, 6జీబీ/64జీబీ వేరియంట్లను కూడా తీసుకొచ్చింది.  ‘నోకియా 5.1 ప్లస్‌ను యూజర్లు ఎంతో అభిమానిస్తున్నారు. దీనికి అనుకూలంగా వారు ఎన్నో వేదికల్లో రేటింగ్‌ కూడా ఇస్తున్నారు. కనుక అధిక సామర్థ్యంతో కూడిన రకాలను తీసుకొచ్చినట్టు’ హెచ్‌ఎండీ గ్లోబల్‌ దేశీయ అధిపతి అజేయ్‌ మెహతా తెలిపారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌  ఆండ్రాయిడ్‌ వన్‌ తదితర బెస్ట్‌ ఫీచర్లతో మంచి పనితీరుతో ఉంటుందన్నారు. బ్లూ, బ్లాక్‌ కలర్స్‌లో  ఫ్లిప్‌కార్ట్‌, నోకియా స్టోర్లలోఈ స్మార్ట్‌ఫోన్లు లభ్యం. 

మరోవైపు ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు రూ.2వేల క్యాష్‌బ్యాక్‌తోపాటు 240 జీబీ అదనపు డేటా కూడా లభించనుంది. 

నోకియా 5.1 ప్లస్‌  ఫీచర్లు
5.8 అంగుళాలా నాచ్‌ డిస్‌ప్లే
మీడియాటెక్‌ హీలియో పీ60 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
720×1520 పిక్సెల్స్‌  రిజల్యూషన్‌
13+5 ఎంపీ  డ్యుయల్‌ రియర్‌ కెమెరా
8 ఎంపీ  సెల్పీ కెమెరా
3060 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ధరలు
6జీ/64జీబీ మోడల్‌ ధర రూ.16,499 
4జీబీ/64జీబీ వెర్షన్‌ ధర రూ.14,499


 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top