భారీగా తగ్గిన నోకియా 4.2 ధర

Nokia 4.2 Smartphone Gets Huge Price Cut in India - Sakshi

న్యూఢిల్లీ: ‘నోకియా 4.2’ స్మార్ట్‌ఫోన్‌ ధర భారీగా తగ్గింది. అమెజాన్‌ వెబ్‌సైట్‌లో ప్రస్తుతం ఈ ఫోన్‌ 6,975 రూపాయలకు లభ్యమవుతోంది. ఆరంభ ధరతో పోలిస్తే ఇది 36 శాతం తక్కువ. నోకియా బ్రాండ్‌ ఫోన్ల విక్రయ సంస్థ హెచ్‌ఎండీ గ్లోబల్‌.. ‘నోకియా 4.2’ స్మార్ట్‌ఫోన్‌ను గత మే నెలలో భారత మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. అప్పుడు ఈ బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.10,990 కాగా తర్వాత రూ.9,499కు తగ్గించారు. ఆరంభ ధర కంటే ఇప్పుడు బాగా తగ్గింది.

ఈ బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌లో 5.71 అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 13 మెగాపిక్సల్‌ ప్రైమరీ సెన్సార్‌ కెమెరా, 8 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా, 3జీబీ ర్యామ్, 32జీబీ ఆన్‌బోర్డ్‌ స్టోరేజీ, క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగెన్‌ 439 ప్రాసెసర్, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ స్పెసిఫికేషన్లు ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top