
న్యూఢిల్లీ: సైబర్ దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రపంచంలో ఏ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) వ్యవస్థా కూడా నూటికి నూరు శాతం సురక్షితమైనదని చెప్పడానికి లేదని సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ తయారీ సంస్థ సోఫోస్ ఎండీ (భారత్, సార్క్ దేశాల సేల్స్ విభాగం) సునీల్ శర్మ వ్యాఖ్యానించారు. దీనికి ఆధార్ కూడా మినహాయింపేమీ కాదని స్పష్టం చేశారు. ఐటీ వ్యవస్థల భద్రతపై నివేదిక విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,700 మంది చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ (సీఐవో)లపై ఈ సర్వే నిర్వహించారు. ఇందులో భారత సీఐవోలు 300 మంది ఉన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 70 శాతం మంది సైబర్ దాడులను సమర్ధంగా నివారించే టెక్నాలజీ తమ వద్ద లేదని వెల్లడించారు.