breaking news
IT system
-
విశాఖ, తిరుపతి, అనంత ప్రాంతాల్లో కాన్సెప్ట్ సిటీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐటీ, సంబంధిత పరిశ్రమల కోసం మూడు ప్రాంతాల్లో కాన్సెప్ట్ సిటీలను తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విశాఖ, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లో ఈ కాన్సెప్ట్ సిటీల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రాథమికంగా 10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ సిటీలను ఏర్పాటు చేసేలా ఆలోచించాలని చెప్పారు. అమెరికాలోని ఇండియానాలో ఉన్న కొలంబియా సిటీని సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు. విశిష్ట శైలి నిర్మాణాలన్నీ ఆ సిటీలో కనిపిస్తాయని, ఆ తరహాలోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి, హై ఎండ్ టెక్నాలజీకి చిరునామాగా ఈ సిటీలు తయారు కావాలని సీఎం ఆకాంక్షించారు. కంపెనీ సామర్థ్యం, సైజును బట్టి అక్కడ భూములు కేటాయిద్దామన్నారు. పరిశ్రమలు పెట్టదలుచుకున్న వారికి వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు, అవినీతి లేకుండా పారదర్శక విధానంలో వారికి వసతులు సమకూరుస్తామన్నారు. ప్రోత్సాహక ధరల్లో భూములు, నీళ్లు, కరెంటు ఇద్దామని సీఎం చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా మంచి మానవ వనరులను అందిద్దామన్నారు. గత ప్రభుత్వంలో పాలసీల పేరు చెప్పి ప్రచారం చేసుకున్నారంటూ.. పరిశ్రమలకు ఇవ్వాల్సిన రూ.4 వేల కోట్ల రాయితీలు/ప్రోత్సాహకాలను చంద్రబాబు పూర్తిగా ఎగ్గొట్టడాన్ని సీఎం ఆక్షేపించారు. ఇప్పుడు అదే చంద్రబాబు పరిశ్రమల గురించి, పారిశ్రామికాభివృద్ధి గురించి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సచివాలయాల్లో బలమైన ఐటీ వ్యవస్థ పరిపాలన వ్యవస్థలో విప్లవాత్మక మార్పుగా తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలు.. వలంటీర్ల వ్యవస్థను సాంకేతిక వ్యవస్థతో అనుసంధానించి పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నేరుగా కలెక్టర్‌కు, రాష్ట్ర సచివాలయానికి అనుసంధానం ఉండాలన్నారు. ఈ మేరకు సమాచార సాంకేతిక వ్యవస్థను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. పరిపాలన వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటే అవినీతిని తగ్గించవచ్చన్నారు. గ్రామ, వార్డు సచివాలయానికి వచ్చే వినతులు, ఆర్జీలు ఏ దశలో ఉన్నాయో నేరుగా కంప్యూటర్లో చూసే అవకాశం ఉండాలన్నారు. రేషన్, ఆరోగ్యశ్రీ, పెన్షన్, ఫీజు రీయింబర్స్మెంట్ కార్డులను గ్రామ సచివాలయాల్లోనే ముద్రించి ఇవ్వాలని సూచించారు. ఇప్పటికే సచివాలయాల్లో ప్రింటర్లు, కంప్యూటర్లు, స్కానర్లతో పాటు వలంటీర్లకు సెల్ఫోన్ల కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైందని, ఇవి వచ్చాక వీటిని సక్రమంగా వినియోగించుకునేలా కొత్త అప్లికేషన్లపై దృష్టి పెట్టాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందాలని, పారదర్శకతతో పాటు పథకాల అమల్లో సంతృప్త స్థాయి తీసుకురావాలని చెప్పారు. అవినీతి, పక్షపాతం లేకుండా లబ్ధిదారులందరికీ పథకాలు చేరాలన్నారు. ఈ లక్ష్యం చేరుకోవాలంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో సమర్థవంతమైన, బలమైన ఐటీ వ్యవస్థ ఉండాలన్నారు. తిరుపతిలో టీసీఎస్ క్యాంపస్ తిరుపతిలో క్యాంపస్ పెట్టడానికి టీసీఎస్ సానుకూలంగా ఉందని సీఎం తెలిపారు. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం తిరుపతిలో ఉన్న ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ పక్కనే హై ఎండ్ స్కిల్స్ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రపంచ సాంకేతిక రంగంలో వస్తున్న నూతన విధానాలు, పద్ధతులు, టెక్నాలజీ అంశాలపై బోధన, శిక్షణకు సంస్థను ఏర్పాటు చేయడంపై ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. స్టార్టప్‌ల కోసం ఇదే ప్రాంగణంలో మరొక నిర్మాణం చేయాలన్నారు. ఐటీ విభాగంలోని సదుపాయాలను వినియోగించుకోవాలి ఐటీ శాఖ పరిధిలో ఉన్న అనేక విభాగాలు నిర్వర్తిస్తున్న విధుల గురించి సీఎం ఆరా తీశారు. ఒకే పనిని రెండు మూడు విభాగాలు చేస్తుండటం వల్ల ఓవర్ ల్యాపింగ్ అవుతున్న విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేసి అనేక అప్లికేషన్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చినా, ప్రభుత్వ విభాగాలతో సరైన సమన్వయం లేక.. ఆయా శాఖలు కొత్త అప్లికేషన్ల కోసం ప్రత్యేకంగా ఖర్చు చేస్తున్నాయని వివరించారు. దీనివల్ల ప్రభుత్వ పరంగా ఉన్న వసతులు, మానవ వనరులను సక్రమంగా వినియోగించుకోలేక పోతున్నామని చెప్పారు. ఇతర శాఖలు తయారు చేయించుకుంటున్న అప్లికేషన్లలో సెక్యూరిటీ పరమైన లోపాలు కూడా ఉంటున్నాయని సీఎంకు వివరించారు. వీటిపై సీఎం స్పందిస్తూ.. ఏ ప్రభుత్వ శాఖకు ఎలాంటి అప్లికేషన్ కావాల్సి వచ్చినా తొలుత ఐటీ విభాగం అనుమతి ఇచ్చాకే ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సర్క్యులర్ జారీ చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఐటీ విభాగంలో ఉన్న సదుపాయాలు, వసతులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడా డూప్లికేషన్ లేకుండా ఐటీ శాఖలోని ఒక్కో విభాగానికి ఒక్కో పని అప్పగించాలని సూచించారు. ఆర్టీజీఎస్కు అనాలిటిక్స్ బాధ్యతను అప్పగించడం ద్వారా పూర్తి స్థాయి సేవలు పొందవచ్చని అధికారులు సూచించగా.. అందుకు సీఎం అంగీకరించారు. ఈ సమీక్షలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గౌతంరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఏ ఐటీ వ్యవస్థా పూర్తిగా సురక్షితం కాదు
న్యూఢిల్లీ: సైబర్ దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రపంచంలో ఏ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) వ్యవస్థా కూడా నూటికి నూరు శాతం సురక్షితమైనదని చెప్పడానికి లేదని సెక్యూరిటీ సాఫ్ట్వేర్ తయారీ సంస్థ సోఫోస్ ఎండీ (భారత్, సార్క్ దేశాల సేల్స్ విభాగం) సునీల్ శర్మ వ్యాఖ్యానించారు. దీనికి ఆధార్ కూడా మినహాయింపేమీ కాదని స్పష్టం చేశారు. ఐటీ వ్యవస్థల భద్రతపై నివేదిక విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,700 మంది చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ (సీఐవో)లపై ఈ సర్వే నిర్వహించారు. ఇందులో భారత సీఐవోలు 300 మంది ఉన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 70 శాతం మంది సైబర్ దాడులను సమర్ధంగా నివారించే టెక్నాలజీ తమ వద్ద లేదని వెల్లడించారు. -
సగం వ్యాపార సంస్థలుజీఎస్‌టీలోకి రావాల్సిందే
న్యూఢిల్లీ: దేశంలో ఉన్న 6 కోట్ల ప్రైవేటు వ్యాపారాల్లో కనీసం 3 కోట్లనైనా జీఎస్టీ నెట్వర్క్ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం పన్ను అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రస్తుతానికి జీఎస్టీ నెట్‌వర్క్‌లో భాగమైన వ్యాపార సంస్థలు కోటిలోపే ఉన్నాయని, మూడు కోట్లకు చేర్చడం సాధ్యమేనని ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. అలాగే, ఐటీ వ్యవస్థను కూడా సమస్యల్లేకుండా నిర్వహించాలని కోరినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇటీవలే జరిగిన పన్ను అధికారుల రెండు రోజుల వార్షిక సమావేశంలో ప్రభుత్వం తాజా లక్ష్యాన్ని వారి ముందుంచింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ సైతం పాల్గొన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రత్యక్ష పన్ను వసూళ్ల మండలి (సీబీడీటీ), సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) మధ్య సమచార మార్పిడికి శాశ్వత యంత్రాంగం ఏర్పాటు కీలకమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఎందుకంటే ఆదాయపన్ను రిటర్నుల సమాచారం ఆధారంగా మరింత మందిని నెట్వర్క్ పరిధిలోకి తీసుకురావడం సాధ్యమవుతుందని వివరించాయి. అయితే, ముందు జీఎస్టీ విధానాన్ని పూర్తిగా సర్దుబాటు చేసిన తర్వాత ఈ యంత్రాంగం తెచ్చే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇప్పటికి 72 లక్షల ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ చెల్లింపుదారులు జీఎస్టీలోకి వచ్చి చేరాయి. -
‘కార్డుల’పై ఆందోళన వద్దు
వినియోగదారులకు నష్టం జరగనీయమన్న కేంద్రం న్యూఢిల్లీ: డెబిట్, క్రెడిట్ కార్డుల డేటా తస్కరణ వివాద పరిష్కారానికి కేంద్రం రంగంలోకి దిగింది. 32.5 లక్షల కార్డుల వివరాలు తస్కరణకు గురైన ఈ కేసుకు సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని సదరు బ్యాంకులు, ఆర్బీఐని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం ఆదేశించారు. వినియోగదారులకు ఎలాంటి నష్టమూ జరగకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీఇచ్చారు. కేసును సైబర్ నేరాల్లాగే గుర్తిస్తున్నామని.. ఈ దిశగానే విచారణ ఉంటుందన్నారు. ‘భారతీయ బ్యాంకుల ఐటీ వ్యవస్థ చిత్తశుద్ధి బలమైనది. ఆందోళన చెందాల్సిన పనిలేదు. దీనికి సంబంధించి కేంద్రం సరైన చర్యలు తీసుకుంటుంది. వినియోగదారులకు నష్టం కలగకుండా చూసుకుంటుంది’ అని ఆర్థిక శాఖ కార్యదర్శి శశికాంత దాస్ వెల్లడించారు. డేటా తస్కరణకు సంబంధించి ప్రాథమిక నివేదిక అందిందని.. పూర్తి నివేదిక రాగానే కార్యాచరణ మొదలవుతుందని ఆయన తెలిపారు. జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ డేటా మోసం ద్వారా19 బ్యాంకుల్లో 641 మంది వినియోగదారులకు సంబంధించిన దాదాపు రూ. 1.3 కోట్లు చోరీకి గురైంది. 90 ఏటీఎంల ద్వారానే ఈ కార్డులనుంచి డబ్బులు తీసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. డేటా అతిక్రమణ జరిగిన వాటిలో 26.5 లక్షల కార్డులు ‘వీసా’, ‘మాస్టర్‌కార్డు’లకు చెందినవి కాగా.. 6 లక్షల కార్డులు ’రూపే’ నుంచి జారీ అయినవి. అయితే తమ కార్డుల భద్రత, నెట్‌వర్క్‌ల విషయంలో అలసత్వంగా ఉండే ప్రసక్తే లేదని వీసా, మాస్టర్‌కార్డు తెలిపాయి. ఏటీఎంల ద్వారా లావాదేవీల భద్రతను పర్యవేక్షిస్తున్న హిటాచీ పేమెంట్ సర్వీసెస్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందని వెల్లడించాయి.