డాట్సన్ ‘రెడి-గో’ | nissan relese new datsun brand ready go | Sakshi
Sakshi News home page

డాట్సన్ ‘రెడి-గో’

Apr 30 2016 1:15 AM | Updated on Sep 3 2017 11:03 PM

డాట్సన్ ‘రెడి-గో’

డాట్సన్ ‘రెడి-గో’

జపాన్ దిగ్గజ వాహన కంపెనీ నిస్సాన్ తాజాగా తన ‘డాట్సన్ బ్రాండ్’ కింద మరొక కొత్త కాంపాక్ట్ కారు ‘రెడి-గో’ను మార్కెట్‌లోకి తీసుకురానున్నది.

ధర 2.5 లక్షలు రేపటి నుంచి బుకింగ్స్; జూన్‌లో డెలివరీ
న్యూఢిల్లీ: జపాన్ దిగ్గజ వాహన కంపెనీ నిస్సాన్ తాజాగా తన ‘డాట్సన్ బ్రాండ్’ కింద మరొక కొత్త కాంపాక్ట్ కారు ‘రెడి-గో’ను మార్కెట్‌లోకి తీసుకురానున్నది. దీని ధర రూ.2.5 లక్షలు-3.5 లక్షల శ్రేణిలో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ‘రెడి-గో’ ముందస్తు బుకింగ్స్ మే నెల 1 నుంచి ప్రారంభమౌతాయని, వీటి డెలివరీ జూన్ నెల నుంచి ఉంటుందని తెలిపింది.

వినియోగదారులు ‘రెడి-గో’ కార్లను ఆఫ్‌లైన్‌లోనైతే నిస్సాన్ డీలర్‌షిప్స్ వద్ద (రూ.5,000 డౌన్ పేమెంట్‌తో), ఆన్‌లైన్‌లో స్నాప్‌డీల్‌లో బుకింగ్ చేసుకోవచ్చని వివరించింది. ఇక ఎక్స్ షోరూమ్ ధర, వేరియంట్స్ తదితర వివరాలను కారు విడుదల సమయం(జూన్)లో వెల్లడిస్తామని తెలిపింది. ‘ముఖ్యంగా యువతకు చేరువకావడమే లక్ష్యంగా.. ఎప్పటికప్పుడు కొత్త కార్లు తీసుకొస్తున్నాం’ అని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ అరుణ్ మల్హోత్రా తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement