నెస్లే ఇండియా మూడవ మధ్యంతర డివిడెండ్‌ | Nestle India announces interim dividend of Rs33 per equity share | Sakshi
Sakshi News home page

నెస్లే ఇండియా మూడవ మధ్యంతర డివిడెండ్‌

Dec 4 2017 5:55 PM | Updated on Dec 4 2017 6:00 PM

Nestle India announces interim dividend of Rs33 per equity share - Sakshi

సాక్షి,ముంబై: నెస్లే ఇండియా లిమిటెడ్‌ భారీ డివిడెండ్‌ను ప్రకటించింది. 2017 సంవత్సరానికి మూడవ మధ్యంతర డివిడెండ్‌ను సోమవారం ప్రకటించింది.  ప్రతి ఈక్విటీ షేరుకు రూ.33 చొప్పున ఈ డివిడెండ్‌ చెల్లించనుంది.
 
రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు ఈ మూడవ తాత్కాలిక డివిడెండ్  చెల్లిస్తుంది.  అర్హులైన పెట్టుబడిదారులకు డిసెంబరు 22నాటికి ఈ  చెల్లింపు చేయనుంది. అలాగే  డిసెంబర్ 12 ను రికార్డు తేదీగా  నిర్ణయించింది. కాగా ఇవాల్టి మార్కెట్‌లో నెస్లే ఇండియా లిమిటెడ్  షేరు  స్వల్పంగా నష్టపోయి  రూ. 7680 వద్ద ముగిసింది.

Advertisement
 
Advertisement
Advertisement