తాన్లా లాభం రూ. 134 కోట్లు  | Tanla Platforms declares second interim dividend of Rs 6 per share for FY26 | Sakshi
Sakshi News home page

తాన్లా లాభం రూ. 134 కోట్లు 

Apr 25 2026 4:01 AM | Updated on Apr 25 2026 4:01 AM

Tanla Platforms declares second interim dividend of Rs 6 per share for FY26

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ లాభం రూ. 134 కోట్లుగా నమోదైంది. క్రితం క్యూ4లో నమోదైన రూ. 117 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 14.5 శాతం అధికం. అటు ఆదాయం రూ. 1,024 కోట్ల నుంచి సుమారు 15 శాతం వృద్ధితో రూ. 1,178 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం రూ. 509 కోట్లగా, ఆదాయం రూ. 4,418 కోట్లుగా నమోదైంది. 

2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుకు రూ. 6 చొప్పున కంపెనీ రెండో మధ్యంతర డివిడెండ్‌ ప్రకటించింది. దీనికి ఏప్రిల్‌ 30 రికార్డు తేదీగా ఉంటుంది. విశ్వసనీయమైన ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సవాళ్లను పరిష్కరిస్తూ, కస్టమర్ల వ్యాపార వృద్ధికి తోడ్పడుతున్నామని సంస్థ వ్యవస్థాపక చైర్మన్‌ ఉదయ్‌ రెడ్డి తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement