మొబైల్ ఇంటర్నెట్ యూజర్లు @ 37 కోట్లు | mobile internet users @37 crores | Sakshi
Sakshi News home page

మొబైల్ ఇంటర్నెట్ యూజర్లు @ 37 కోట్లు

Feb 4 2016 2:13 AM | Updated on Aug 29 2018 7:26 PM

మొబైల్ ఇంటర్నెట్ యూజర్లు @ 37 కోట్లు - Sakshi

మొబైల్ ఇంటర్నెట్ యూజర్లు @ 37 కోట్లు

భారత్‌లో మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య జోరుగా పెరుగుతోంది.

♦ ఈ ఏడాది జూన్‌కల్లా  ఈస్థాయికి 
♦ 50శాతం వృద్ధి: ఐఏఎంఏఐ వెల్లడి

 న్యూఢిల్లీ: భారత్‌లో మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య జోరుగా పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ వాడకం కూడా జోరుగా  పెరుగుతోందని ఐఏఎంఏఐ(ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) తెలిపింది. ఈ ఏడాది జూన్ కల్లా మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 55 శాతం వృద్ధితో 37 కోట్లకు పెరుగుతుందని పేర్కొంది. భారత్‌లో మొబైల్ ఇంటర్నెట్ వినియోగం సంబంధిత అంశాల గురించి ఈ సంస్థ వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు....
 
 గత ఏడాది జూన్‌లో 23.8 కోట్లుగా ఉన్న మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి 30.6 కోట్లకు వృద్ధి చెందింది. వీటిల్లో 22 కోట్లు పట్టణ ప్రాంతం వారే. వార్షికంగా చూస్తే మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యలో  71 శాతం వృద్ధి నమోదైంది. గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి గ్రామీణ మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 93 శాతం వృద్ధితో 8.7 కోట్లకు పెరిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement