షావోమి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది | Mi CC9 Pro Launched With 108-Megapixel Penta Lens Camera  | Sakshi
Sakshi News home page

షావోమి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది

Nov 5 2019 4:15 PM | Updated on Nov 5 2019 8:44 PM

Mi CC9 Pro Launched With 108-Megapixel Penta Lens Camera  - Sakshi

షావోమి  తన అద్భుతమైన కెమెరాను  అధికారికంగా లాంచ్‌ చేసింది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో సహా ఐదు వెనుక కెమెరాలుతో ప్రతిష్టాత్మక స్మార్ట్‌ఫోన్‌ను నేడుబీజింగ్‌లోఆవిష్కరించింది. ఎంఐ సిరీస్‌లో భాగంగా  ఎంఐ సీసీ9 ప్రొ పేరుతో దీన్ని లాంచ్‌ చేసింది. 

ఎంఐ సీసీ 9 ప్రో ధర
బేసిక్‌ వేరియంట్‌ 6జీబీ ర్యామ్‌/ 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర సిఎన్‌వై 2,799 (సుమారు రూ .28,000) 
హై-ఎండ్ 8జీబీ ర్యామ్‌/ 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్  ధర సిఎన్‌వై 3,099 (సుమారు రూ. 31,000) 
ప్రీమియం ఎడిషన్‌ ధర  8జీబీ ర్యామ్‌/ 256 జీబీ స్టోరేజ్‌ సిఎన్‌వై 3,499 (సుమారు రూ .35,000) 

ఎంఐ సీసీ 9 ప్రో స్పెసిఫికేషన్లు
డ్యూయల్ సిమ్ (నానో) మి సిసి 9 ప్రో MIUI 11 ను నడుపుతుంది. ఈ ఫోన్‌లో 
6.47-అంగుళాల  కర్వ్‌డ్‌ ఫుల్‌ హెచ్‌డి ప్లస్‌ డిస్‌ప్లే
1080x2340 పిక్సెల్స్   రిజల్యూషన్‌
ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్ 
108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఎఫ్ / 1.69 ఎపర్చరు ఫోర్-యాక్సిస్ ఓఐఎస్ (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) 
117డిగ్రీల 20 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 
2x ఆప్టికల్ జూమ్‌తో12 ఎంపీ షార్ట్ టెలిఫోటో లెన్స్
50x డిజిటల్ జూమ్ సపోర్ట్‌తో 8 ఎంపీ లాంగ్‌ టెలిఫోటో లెన్స్
32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఎఫ్ / 2.0 ఎపర్చర్‌
5260 ఎంఏహెచ్ బ్యాటరీ
ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 

నవంబర్ 11 న చైనాలో విక్రయాలు ప్రారంభం. ప్రారంభమవుతుంది. ఇతర మార్కెట్లలో దీని లభ్యతపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.  హువావే మేట్ 30 ప్రో,  గెలాక్సీ నోట్ 10+, గూగుల్ పిక్సెల్ 4 ఫోన్లకు ఇది గట్టిపోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement