బెంజ్ కొత్త ఎస్యూవీ లాంచ్ | Mercedes launches SUV GLC at Rs 50.9 lakh | Sakshi
Sakshi News home page

బెంజ్ కొత్త ఎస్యూవీ లాంచ్

Jun 2 2016 4:03 PM | Updated on Sep 4 2017 1:30 AM

జర్మన్ లగ్జరీ కార్ మేకర్ మెర్సిడెస్ బెంజ్ కొత్త లగ్జరీ కారును విడుదల చేసింది.

న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ మేకర్ మెర్సిడెస్ బెంజ్  కొత్త లగ్జరీ కారును విడుదల చేసింది.   ఎస్యూవీ సెగ్మెంట్  కొత్త జీఎల్సీని లాంచ్ చేసింది. పుణే లో దీని ఎక్స్ షో రూం ధర 50.9 లక్షలుగా నిర్ణయించింది. డీజిల్.. పెట్రోల్ రెండు వెర్షన్లలోనూ మార్కెట్లో ఆవిష్కరించింది. 2143 సీసీ డీజిల్  జీఎల్సీ 220డీ ధర 50.7 లక్షలకు. 1991 సీసీ  పెట్రోల్ జీఎల్సీ 300 ధర 50.9 లక్షలకు విక్రయిస్తున్నట్టు  బెంజ్ ప్రకటించింది.

 బెంజ్ జీ సిరీస్ లోని జీఎల్ఎ .. జీఎల్ఈ  లగ్జీరీ ఎస్ యూవీ ల మధ గ్యాప్ ను పూరించడంలో తమ కొత్త జీఎల్ సీ కీలక పాత్ర పోషిస్తుందని  మెర్సిడెస్ బెంజ్  ఇండియా  ఎండీ, సీఈఓ రోలాండ్ ఫోల్గేర్   విలేకరులకు తెలిపారు.  కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ గా భారతదేశంలోకి దీన్ని దిగుమతి   చేస్తున్నట్టు  చెప్పారు. భారతదేశం లో లగ్జరీ కారు వినియోగదారులు ఆసక్తిగా ఉన్నారనీ, ఈ నేపథ్యంలో తమ ఎస్యూవీ సెగ్మెంట్ లో డిమాండ్ బావుందని, తమ  కొత్త ఎస్యూవీ వారిని ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement